ఎప్పుడో మూడు నెలల తర్వాత విడుదల తేదీల గురించి కూడా ఇప్పుడే మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్ లో తలెత్తుతోంది. ముందు ఒక డేట్ ప్రకటించడం, తర్వాత తప్పక తప్పుకుని వాయిదా వేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో 2024 మార్చి మీడియం రేంజ్ హీరోలు తలపడేందుకు వేదికగా మారుతోంది. రామ్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ 8వ తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి ఇష్టం లేకపోయినా పోస్ట్ పోన్ చేసుకున్న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’తో రామ్ ని ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాడు.
సంక్రాంతి బారి నుంచి తప్పుకున్న విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ని మార్చిలోనే తీసుకొస్తామని దిల్ రాజు నిన్న అధికారికంగా ప్రకటించారు. అయితే పైన చెప్పిన డేట్ కాకపోవచ్చు కానీ మూడో వారం వైపు చూస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక అఫీషియల్ గా ప్రకటిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ సైతం ఆ నెలే బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఫిబ్రవరి కాస్త డ్రైగా ఉంటుంది కాబట్టి నిర్మాత అనిల్ సుంకర త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి చిన్న చిత్రాలు రేస్ లో ఉండొచ్చు.
తిరిగి ఏప్రిల్ లో దేవరతో మొదలుపెట్టి చాలా ప్యాన్ ఇండియా మూవీస్ క్యూ కడతాయి కాబట్టి వీలైనంత వరకు రిస్క్ లేకుండా చూసుకోవాలంటే మీడియం హీరోలు మార్చిలోపు వచ్చేయాలి. లేదంటే థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్స్ తగ్గిపోయే రిస్క్ ఉంటుంది. అందుకే మార్చి మీద ఇందరు హీరోలు దృష్టి పెడుతున్నారు. కొందరు నిర్మాతలకు వడ్డీల భారం పెరుగుతున్నా కష్టం మీద వెయిటింగ్ ని భరిస్తున్నారు. ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ క్రేజీ సినిమాలు లేకపోయినా ఆ నెలను అంతగా ఇష్టపడటం లేదు. మార్చి కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా లిస్టు పెరుగుతుంది.
This post was last modified on December 3, 2023 8:20 pm
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…