అనుకున్నట్లే సందీప్ రెడ్డి వంగ కొత్త చిత్రం యానిమల్ సంచలనం రేపుతోంది. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నప్పటికీ తొలి రోజు వచ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. యూత్ ఈ సినిమా చూసి వెర్రెక్కి పోతున్నారన్నడంలో సందేహం లేదు. వీకెండ్ అంతా కూడా యానిమల్ కు ఎదురులేనట్లే కనిపిస్తోంది. అయితే ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా దూరమయ్యేలా కనిపిస్తున్నారు. సంప్రదాయ సినిమా ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం రుచించడం కష్టమే. అందుకు సినిమాలోని విపరీతమైన హింస కారణం కాదు. ఇలాంటి వయోలెన్సుకి ఆడియన్స్ బాగానే అలవాటు పడిపోయారు. సమస్య అంతా సినిమాలోని అబ్సీన్ కంటెంట్ గురించే.
ఓటీపీల ఊపు పెరిగాక ఇంటిమేట్ సీన్లు బూతు డైలాగులకు కూడా ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. కానీ యానిమల్ సినిమాలోని కొన్ని సీన్లలో డైలాగులు.. హావభావాలు సగటు ప్రేక్షకులు ఈజీగా తీసుకోలేని విధంగా ఉన్నాయి. ఒక సన్నివేశంలో డాక్టర్ తో హీరో సెక్స్ గురించి సంభాషణ జరుపుతాడు. అది మరి ఆ సీన్ మరి సుదీర్ఘంగా సాగి కొంచెం ఎబెట్టుగా అనిపిస్తుంది. మరో సన్నివేశంలో జరిగే చర్చ అయితే మరీ ఇబ్బంది పెడుతుంది. ఇక మరో సీన్లో రష్మిక డ్రెస్ తీసి పనిమనిషి ముందే హీరోను ఓదార్చే సన్నివేశం కూడా ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మూవీలో ఏదోలా అనిపిస్తుంది. థియేటర్లలో ఇలాంటి సన్నివేశాలకు మెజారిటీ ప్రేక్షకులు ఇబ్బంది పడతారు.
ఇవన్నీ యువ ప్రేక్షకులను ఆకర్షించడానికి పెట్టిన సీన్లని.. అవి వల్గర్ గా ఉన్నాయి.అని అన్నామంటే సందీప్ రెడ్డి కన్విక్షన్ ను తప్పుబట్టినట్లే. అతనికో శైలి ఉంది. తన సినిమాకు భాష ఉంది. అతను ఏదైనా పచ్చిగా చెప్పాలనుకుంటాడు. చూపించాలనుకుంటాడు. ఈ విషయంలో అతని తప్పు పడితే పరిణతి లేనట్లే. కానీ సందీప్ కొంచెం తనను తాను నియంత్రించుకుంటే.. ఇలాంటి సన్నివేశాలను పరిహరిస్తే లేదా డోస్ తగ్గిస్తే సినిమాకు ఇంకా రీచ్ పెరుగుతుంది, మరింత మంది ప్రేక్షకులు తన చిత్రాన్ని చూస్తారు అనడంలో సందేహం లేదు.
This post was last modified on December 3, 2023 4:23 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…