ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు ఆగిపోయాయి కానీ.. ఒకప్పుడు అర్ధరాత్రి 1-2 గంటల మధ్య.. తెల్లవారుజామున 4-5 గంటలకు షోలు పడిపోయేవి. పెద్ద హీరోల క్రేజీ సినిమాలకు విడుదల రోజు ఈ షోలు ఉండేవి. ఇప్పుడు ఉదయం 6-7 గంటలకు షోలు మొదలవుతున్నాయి. కానీ ఆ డిమాండ్ తొలి రోజు మాత్రమే ఉంటోంది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన యానిమల్ సినిమాకు శనివారం అర్ధరాత్రి తర్వాత షోలు షెడ్యూల్ కావడం.. అవన్నీ ఫుల్ అయిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముంబైలో అనేక మల్టీప్లెక్స్ లు వీకెండ్ డిమాండ్ తట్టుకోలేక అర్ధరాత్రి పదుల సంఖ్యలో షోలు షెడ్యూల్ చేశాయి.
11.30, 12.00, 12.30, 1.00,1.30, 2.00 ఈ టైమింగ్స్ లో పగటిపూట షోలు మామూలే కానీ.. అర్ధరాత్రి వేళ ఈ టైమింగ్స్ లో షోలు పెద్ద సంఖ్యలో హౌస్ ఫుల్ తో రన్ అవ్వడం అరుదైన విషయం. మల్టీప్లెక్స్ లకు 24 గంటలు షోలు నడిపించుకునే అనుమతి ఉండడంతో పివిఆర్ సహా పలు థియేట్రికల్ చైన్స్ అర్ధరాత్రి షోలు నడిపిస్తున్నాయి. మిడ్ నైట్ షోలు అయ్యాక ఒకటి రెండు గంటల గ్యాప్ లోనే ఉదయం 6 నుంచి రెగ్యులర్ షోలు షెడ్యూల్ కావడం విశేషం. యానిమల్ మూడున్నర గంటల సినిమా కావడంతో షోలు ఆడించినా గరిష్టంగా ఆరుకు మించట్లేదు. మల్టీప్లెక్స్ సిబ్బంది షిఫ్టుల మీద 24 గంటలు పని చేయాల్సి వస్తోంది.
This post was last modified on December 2, 2023 11:50 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…