ఇష్టం అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి 13బి అనే వెరైటీ థ్రిల్లర్ మూవీతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు విక్రమ్ కే కుమార్. అప్పట్నుంచి అతను వైవిధ్యమైన సినిమాలే తీస్తున్నాడు. ఇష్క్, మనం, 24, గ్యాంగ్ లీడర్… ఇలా ఏ చిత్రం తీసుకున్నా బాక్స్ ఆఫీస్ ఫలితం పక్కన పెడితే విక్రమ్ సినిమా అంటే ఏదో ఒక వెరైటీ ఉంటుందని నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
కానీ థాంక్యూ అనే సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అందులో ఏమాత్రం విక్రమ్ మార్కు కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఇంత సాధారణమైన కథను విక్రమ్ ఎలా టేకప్ చేశాడు అని అందరూ షాక్ అయ్యారు. అయితే నిజానికి అది విక్రమ్ సొంత కథ కాదు. దానికి స్క్రిప్ట్ అందించింది బీవీఎస్ రవి. ఒక ఐడియాకు ఎగ్జిట్ అయి విక్రమ్ తీసిన ఈ సినిమా కాస్ట్లీ మిస్టేక్ అయింది.
థాంక్యూ చిత్రం విక్రమ్ పేరును కూడా కొంతమేర చెడగొట్టింది. తర్వాత అతని ఎలా పుంజుకుంటాడా అని అందరూ ఎదురు చూశారు. అయితే థాంక్యూ హీరో నాగచైతన్యతోనే విక్రమ్ తీసిన వెబ్ సిరీస్ దూత తనేంటో రుజువు చేసింది. విక్రమ్ సొంత కథతో తయారు అయిన సిరీస్. 13బి.. మనం.. 24.. సినిమాల కోవలోనే సూపర్ నేచురల్ కథకు తన మార్కు స్క్రీన్ ప్లే జోడించి ఈ సిరీస్ ను ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దాడు విక్రమ్ కుమార్. అడుగడుగునా దర్శకుడి ప్రతిభ కనిపించింది. రచయితగాను విక్రమ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఈ సిరీస్ చూసిన వాళ్లంతా ఇది కదా విక్రమ్ కుమార్ అంటే అనుకుంటున్నారు. తొలిసారిగా చైతుతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయించి మెప్పించడం ఇందులో మరో స్పెషాలిటీ. మొత్తానికి విక్రమ్ తిరిగి ట్రాక్ ఎక్కడంతో అతడి నుంచి మళ్లీ ఒక వైవిద్యమైన సినిమా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
This post was last modified on December 2, 2023 11:20 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…