నిన్న విడుదలైన యానిమల్ చూసిన వాళ్లలో చాలా ప్రేక్షకులకు మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్న కంటే కథలో కీలక మలుపుకు కారణమై, రన్బీర్ కపూర్ తో ఒక బోల్డ్ సీన్ లో కూడా నటించిన జోయా అలియాస్ త్రిప్తి డిమ్రీ బాగా నచ్చేసింది. సింపుల్ లుక్స్ తో ఒకరకమైన సెక్సీ అప్పీల్ తో దర్శకుడు సందీప్ వంగా కోరుకున్న ఎక్స్ ప్రెషన్స్ చక్కగా పండించిన ఈ నటి ఎవరబ్బా అనే సందేహం మిగిలిపోయింది. అదేంటో చూద్దాం. ఈ అమ్మాయి 2017లో పోస్టర్ బాయ్స్ తో ఇండస్ట్రీకి వచ్చింది. రెండేళ్ల తర్వాత లైలా మజ్నులో హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది.
ఇవి రెండు అంతగా బ్రేక్ ఇవ్వలేకపోయాయి. 2020లో చేసిన ఓటిటి డెబ్యూ బుల్ బుల్ పేరునే కాదు అవార్డులు కూడా తీసుకొచ్చింది. గత ఏడాది టైటిల్ రోల్ చేసిన ఖలా సైతం విమర్శకుల మెప్పు పొందిందే. ఫోర్బ్స్ ఆసియా లిస్టు 2021లో చోటు సంపాదించుకోవడం త్రిప్తి డిమ్రీ అచీవ్ మెంట్లలో ఒకటి. రెడిఫ్ డాట్ కామ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా తను కామన్ థియేటర్ ఆడియన్స్ దృష్టిలో అంతగా లేదు. కానీ యానిమల్ చూశాక మాత్రం ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. చిన్న పాత్రే అయినా ఇంపాక్ట్ అలా ఉంది.
ఉత్తరాఖండ్ కు చెందిన త్రిప్తి డిమ్రీకి అనిమల్ పుణ్యమాని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మేరె మెహబూబ్ మేరె సనమ షూటింగ్ పూర్తి చేసుకోగా విక్కీ విద్యా కా నోవాలా వీడియో సెట్స్ మీదున్నాయి. ట్విస్ట్ ఏంటంటే తాజాగా తమిళ తెలుగు నుంచి కూడా అమ్మడికి అవకాశాలు వస్తున్నాయట. సపోర్టింగ్ పాత్ర అందులోనూ రన్బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి పవర్ హౌస్ ల మధ్య చేస్తున్నప్పుడు ఐడెంటిటీ రావడం కష్టం. అలాంటిది ఇంత తక్కువ లెన్త్ తోనూ త్రిప్తి డిమ్రీ హైలైట్ అవ్వడం చూస్తే ఏదో అదృష్టం దశ తిరిగిన టైంలో సందీప్ వంగా కళ్ళలో పడ్డట్టుంది.
This post was last modified on December 2, 2023 11:25 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…