ప్రస్తుతం టాలీవుడ్ లో బయటికి కనిపించని ఒక విధమైన అనిశ్చితి రాజ్యమేలుతోంది. బయటికి చెప్పుకోవడం లేదు కానీ నిర్మాతలు, హీరోలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితికి కళ్ళముందే ఆధారాలున్నాయి. అధికారికంగా అనౌన్స్ చేసిన పెద్ద హీరో సినిమాని చెప్పా పెట్టకుండా రద్దు చేయడం ఇందులో భాగంగా జరిగిందే. ఈ నేపథ్యంలో హీరో నితిన్ తండ్రి, నిర్మాత కం పంపిణీదారులు సుధాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎలాంటి మార్పులు అవసరమో సూచిస్తున్నాయి. ఎక్స్ ట్రాడినరి సాంగ్ లాంచ్ లో భాగంగా టీమ్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగానే సదరు ప్రస్తావన వచ్చింది.
దాని ప్రకారం ఆయన వెర్షన్ ఇలా ఉంది. ఓటిటిలు సంవత్సరానికి తమకు కావాల్సిన ముఖ్యమైన పన్నెండు సినిమాలు కొనేసుకున్నాయి. ఎప్పుడో రెండేళ్ల తర్వాత వచ్చే పెద్ద హీరోలవి ఇప్పుడే అడుగుతున్నారు. దీని వల్ల మీడియం బడ్జెట్ చిత్రాలకు చిక్కొచ్చింది. మొన్నటి దాకా ముప్పై కోట్లు పలికిన నితిన్ మూవీని ఇప్పుడు పాతికకే అడుగుతున్నారు. రేపు ఇరవైకి దిగొచ్చు. ఇకపై ప్రొడ్యూసర్లు జాగ్రత్త పడి ఖర్చులు తగ్గించుకోకపోతే ఇబ్బంది తప్పదు. అందరూ తగ్గాల్సిందే. మనమే హైప్ చేసుకుని, మనమే పెంచుకుని, మనమే పోతామంటే ఎవరేం చేయలేరు.
నిజానికి సుధాకర్ రెడ్డి అన్న మాటలు వాస్తవిక కోణంలో ఉన్నవే. కేవలం డిజిటల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఆకాశమే హద్దుగా హీరోల రెమ్యునరేషన్లు పెరగడంతో పాటు నిర్మాతలు సైతం మితిమీరిన ఖర్చుకి తెగబడటం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. హక్కుల రూపంలో ఆదాయం వస్తోందని కంటెంట్ ని నిర్లక్ష్యం చేయడం వల్ల అంతిమంగా నష్టపోతున్నది ఎవరు. ఈ ప్రశ్నను ఎవరికి వారు వేసుకుని హద్దుల్లో ఉంటే స్లంప్ ని చక్కదిద్దవచ్చు. అలా కాకుండా మేమింతే అనే ధోరణి ఉంటే మాత్రం ఇంకా దిగజారిపోతోంది. ఎక్స్ ట్రాడినరి మ్యాన్ నితిన్ స్వంత బ్యానర్ లో రూపొందిన సంగతి తెలిసిందే.
This post was last modified on December 2, 2023 4:49 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…