Movie News

త్రిషకు మద్దతు వెనుక విశ్వంభర ?

ఇటీవలే తీవ్ర వివాదానికి దారి తీసిన మన్సూర్ అలీ ఖాన్ కామెంట్ల వ్యవహారం చాలా దూరం వెళ్లడం చూశాం. త్రిష మీద హద్దులు మీరి మాట్లాడి, తర్వాత విమర్శలు వచ్చాక సారీ చెప్పి, ఒక్క రోజు గడవటం ఆలస్యం కేసులు పెడతానని మళ్ళీ రచ్చకెక్కడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కాంట్రావర్సి కొనసాగుతున్న టైంలో చిరంజీవి ట్విట్టర్ వేదికగా త్రిషకు మద్దతు పలికి ఈ ఘటనను తీవ్రంగా ఖండించడం తెలిసిందే. ఇక్కడితో మన్సూర్ ఊరుకోలేదు. ఏకంగా ఇరవై కోట్లు డిమాండ్ చేస్తూ మెగాస్టార్ మీద పరువు నష్టం దావా వేసి ఆ వచ్చిన డబ్బును పేదలకు సహాయం చేసేందుకు వాడతానని ఏదేదో అన్నాడు.

ఇదంతా జరిగే పని కాదు కానీ మన్సూర్ కేవలం పబ్లిసిటీ పిచ్చితో ఇదంతా చేశాడనేది చెన్నై వర్గాల కామెంట్. ఇదిలా ఉండగా చిరు ప్రత్యేకంగా త్రిషకు సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఆమె విశ్వంభరలో ఒక హీరోయిన్ గా ఎంపికవ్వడమేననే మాట ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకుంది. క్యాస్టింగ్ ని అధికారికంగా ప్రకటించలేదు. రానా విలన్ గా కన్ఫర్మ్. అనుష్క కూడా ఉన్నట్టే. త్రిష మరో జోడని చెబుతున్నారు. ఇవన్నీ తేలిగ్గా చెప్పే విషయాలు కాదు కాబట్టి సమయం కోసం వేచి చూస్తన్నారు.

ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించే చిరంజీవి తనకు కో స్టార్ కాబోతున్న త్రిషను నైతిక మద్దతు ఇవ్వడం ద్వారా ఉత్తి పుణ్యనా మన్సూర్ అలీ ఖాన్ తో ఆధారాల్లేని ఆరోపణలు పడాల్సి వస్తోంది. సరే దీని వల్ల ఆయన ఇమేజ్, పేరు ప్రతిష్టలకు వచ్చిన మచ్చేమి లేదు కానీ అటుపక్క అతను మాత్రం పదే పదే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల ప్రస్తావన తెస్తూ వైరల్ గా మారుతున్నాడు. ఒకవేళ ఈ గొడవ ముదిరినా కూడా చిరు మౌనంగా ఉండటం బెటర్. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నప్పుడు స్పందిస్తే తిరిగి దాన్నీ మళ్ళీ పబ్లిసిటీ అస్త్రంగా వాడుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వదిలేస్తే ఏ గొడవా ఉండదు.

This post was last modified on November 29, 2023 4:04 pm

Share

Recent Posts

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

2 hours ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

2 hours ago

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

3 hours ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

3 hours ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

4 hours ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

4 hours ago