Movie News

ఆ సినిమా కోసం సుకుమార్ రంగంలోకి

గత ఏడాది ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్. ‘హుషారు’ లాంటి యూత్ ఫుల్ మూవీతో హిట్ కొట్టిన హర్ష ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాను సూపర్ అనలేం. అలా అని తీసిపడేయనూలేం. ఆశిష్‌లో మంచి ఈజ్ ఉందనే పేరొచ్చింది ఈ సినిమాతో.

తర్వాత ఆశిష్ ‘సెల్ఫిష్’ అనే సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘లవ్ టుడే’తో అందరి దృష్టిలో పడ్డ తమిళ హీరోయిన్ ఇవానా ఇందులో ఆశిష్‌కు జోడీగా ఎంపికైంది. దిల్ రాజు బేనర్లోనే కాశీ అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. కొన్ని నెలల కిందటే ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. షూటింగ్ కూడా చకచకా జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలో ఏమైందో ఏమో ఈ సినిమాను తాత్కాలికంగా ఆపారు అనే వార్త బయటికి వచ్చింది.

స్క్రిప్టు అంతా బాగానే ఉన్నప్పటికీ టేకింగ్ విషయంలో ఏదో తేడా వచ్చిందని అంటున్నారు. దర్శకుడు కొత్తవాడు కావడం, అనుభవం లేకపోవడంతో టేకింగ్ పరంగా ఇబ్బంది పడ్డాడంటున్నారు. స్క్రిప్టు మీద ఉన్నది తెర మీదికి అనుకున్నంత బాగా రాలేదట. బడ్జెట్ పరంగా ఏ రకమైన ఇబ్బందులూ లేకపోయినప్పటికీ.. ఒక ఫీచర్ ఫిలింలో కనిపించాల్సిన రిచ్‌నెస్ రాలేదని తెలుస్తోంది. దర్శకుడు కాశీ సుకుమార్ అసిస్టెంట్ కావడం గమనార్హం. కొన్నేళ్ల నుంచి సుక్కు శిష్యుల ఆధిపత్యం నడుస్తోంది టాలీవుడ్లో. ఆయన అసిస్టెంట్ అంటే నమ్మకంగా సినిమా ఇస్తున్నారు. సుక్కు స్కూల్ నుంచి వచ్చిన బుచ్చిబాబు ‘ఉప్పెన’తో సంచలనం రేపి ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్‌తో సినిమా తీస్తున్నాడు. కాశీ కూడా టాలెంటెడ్ అన్నది సుక్కు టీం మాట.

ఐతే అనుభవ లేమితో కొంచెం తడబడి ఉండొచ్చు. ఈ సినిమాను సరి చేయడానికి సుక్కు రంగంలోకి దిగనున్నారట. తన శిష్యుడి సినిమా ఆగిందంటే సుక్కుకి కూడా ఇబ్బందే. అందుకే ‘పుష్ప’ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కొంచెం వీలు చేసుకుని ఈ సినిమా రష్ చూడబోతున్నారట. స్క్రిప్ట్, టేకింగ్ పరంగా కరెక్షన్లు సూచించి.. సినిమాను తిరిగి పట్టాలెక్కించడానికి ఆయన ఒక చేయి వేయబోతున్నట్లు సమాచారం.

This post was last modified on November 28, 2023 2:10 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

43 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago