యానిమల్ కథను విన్న ఎవ్వరైనా ఈజీగా రిజెక్ట్ చేస్తారని.. కానీ రణబీర్ కపూర్ మాత్రం తనను నమ్మి ఈ సినిమా చేశాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అన్నాడు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన యానిమల్ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సందీప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా రన్ టైం గురించి ఆందోళన అక్కర్లేదని అతనన్నాడు. యానిమల్ 3 గంటల 21 నిమిషాల నిడివితో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సందీప్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పర్టికులర్‌గా మాట్లాడాడు.
”లెంగ్త్ గురించి ఆందోళన చెందకండి. ప్రతి ఫ్రేమ్‌నూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే రణబీర్ కపూర్‌తో పాటు అనిల్ సార్, బాబీ డియోల్ సాగర్, రష్మిక లాంటి గొప్ప నటులు సినిమాలో ఉన్నారు. అర్జున్ రెడ్డిలో అమ్మాయి వెనక్కి రాగానే కథ సుఖాంతం అయిపోయింది. కానీ ఈ కథ సుఖాంతం కాదు. డిసెంబరు 1న థియేటర్లకు రండి. ఈ సినిమా చూసినపుడు కలిగే అనుభూతి ఇంతకుముందు ఎప్పుడూ కలిగి ఉండదు. ఆ మేరకు హామీ ఇవ్వగలను.
నిజానికి ఈ కథను ఎవరైనా కూడా.ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు. లాజిక్కులు లేవా? డ్రామా ఏంటి ఇలా ఉందని చెప్పి రిజెక్ట్ చేయొచ్చు. కానీ రణబీర్ నన్ను నమ్మాడు. నాతో ట్రావెల్ అయ్యాడు. ఈ రోజే యానిమల్ కలర్ గ్రేడింగ్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. ఇక ఇది నా సినిమా కాదు. మీ సినిమా. మళ్లీ చెప్తున్నా లెంగ్త్ గురించి ఆందోళన చెందకండి. అలాగే సినిమాలో ఆరంభం మిస్ కావద్దు. ముగింపు కూడా మిస్ అవ్వొద్దు. ఇదేదో మొత్తం చూడాలని చెప్పట్లేదు. నేనొక గొప్ప తండ్రీ కొడుకుల కథను తీశాననుకుంటున్నా. సినిమా మీద నేనెంతో నమ్మకంతో ఉన్నా. మీరు కూడా అది చూసి ఎంజాయ్ చేస్తారు. డిసెంబరు 1న కలుద్దాం” అని సందీప్ ముగించాడు.
This post was last modified on November 28, 2023 6:22 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…