బాబీ డియోల్.. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు కానీ.. స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. హీరోగా నిలదొక్కుకోలేక క్యారెక్టర్, విలన్ రోల్స్ కూడా చేసినప్పటికీ.. సరైన బ్రేక్ రాక ఇబ్బంది పడ్డాడు. ఈ తరం ప్రేక్షకులకు అతను కనెక్ట్ కాలేకపోయాడనే చెప్పాలి. అందరూ అతణ్ని మరిచిపోతున్న సమయంలో ‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు ఈ సీనియర్ నటుడు.
ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఎంచుకోవడం ద్వారా బాబీ డియోల్ కెరీర్‌నే సందీప్ రెడ్డి వంగ మార్చేశాడని చెప్పాలి. తన కెరీర్ ఏమంత బాగా లేని, తన చేతిలో పెద్దగా వర్క్ లేని సమయంలో సందీప్ ‘యానిమల్’లో విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్లో చెప్పాడు బాబీ డియోల్. ఈ చిత్రంలో తాన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని.. ఇలాంటి పాత్ర తనకు ఇచ్చినందుకు సందీప్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని అతను ఎమోషనల్‌గా చెప్పాడు.
‘యానిమల్’ ట్రైలర్లో రణబీర్ తర్వాత ఎక్కువ హైలైట్ అయింది బాబీ డియోలే. ఇందులో పాత్ర కోసం స్వీట్స్ మానేసి, అనేక ఆహార నియమాలు పాటించి, వర్కవుట్లు చూసి చిజిల్డ్ బాడీలోకి మారాడు బాబీ డియోల్. ఈ పాత్రకు రిలీజ్ కంటే ముందే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ అతడికి ఆఫర్లు వరుస కడుతున్నాయి. నందమూరి బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో చేయబోయే తెలుగు చిత్రంలో అతనే విలన్ పాత్ర పోషించబోతున్నాడు. హిందీలో కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట బాబీకి. ఈ సినిమా రిలీజ్ తర్వాత అతడికి మరింత డిమాండ్ ఏర్పడవచ్చు.
This post was last modified on November 27, 2023 11:04 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…