భీష్మతో తన ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్ట వేసినట్లే కనిపించాడు యువ కథానాయకుడు నితిన్. కానీ తర్వాత వరుసగా చెక్, రంగ్‌దె, మాచర్ల నియోజకవర్గం చిత్రాలతో షాక్‌ల మీద షాక్‌లు తిన్నాడు. ఇప్పుడు అతను భీష్మ శైలి ఎంటర్టైనర్‌తో రాబోతున్నాడు. అదే.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వక్కంతం వంశీ రూపొందిస్తున్న చిత్రమిది. దర్శకుడిగా తొలి చిత్రం నా పేరు సూర్యను చాలా సీరియస్ కథతో తీసిన వక్కంతం.. ఈసారి మాత్రం పూర్తి ఎంటర్టైనర్ ట్రై చేసినట్లున్నాడు.
టీజర్, ట్రైలర్ రెండూ కూడా వినోదాత్మకంగా ఉండి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇక ఈ సినిమాలో రెఫరెన్సులైతే చాలానే కనిపిస్తున్నాయి. కామెడీ అంతా కూడా వేరే సినిమాలు, ఆర్టిస్టుల రెఫరెన్సుల మీదే ఆధారపడి నడిచేలా కనిపిస్తోంది.
నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్ రెఫరెన్సులు మామూలే. ఆ విషయంలో అతనేమీ మొహమాట పడడు. ఎప్పటికీ తాను పవన్ ఫ్యాన్‌నే అని చెప్పే నితిన్.. ఈ చిత్రంలోనూ బద్రిలో పవన్ గెటప్ వేశాడు. ఆ పోస్టర్ కూడా వదిలారు. ఇక టీజర్లో బాహుబలి రెఫరెన్స్ సీన్ ఎలా హైలైట్ అయిందో తెలిసిందే. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. బాలయ్య తన అభిమానులను కొట్టే విషయమై కామెడీ సీన్ ఒకటి పెట్టారు. దాన్నొక సస్పెన్స్ లాగే మధ్యలో ఆపేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. సినిమాలో దీనికి ఎలాంటి ముగింపునిస్తారో చూడాలి.
ఏదైనా బాలయ్య అభిమానులు ఫీల్ కాని విధంగానే ఉండొచ్చు. మరోవైపు తమిళ భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ మీద ఇందులో పంచ్ వేశారు. పొన్నియన్ సెల్వన్ అర్థం కాని సినిమా అనే అర్థం వచ్చేలా ఒక డైలాగ్ పేల్చాడు నితిన్. ఇలా ఎక్స్‌ట్రా సినిమా అంతా బోలెడన్ని రెఫరెన్సుల మీద నడిచేలా కనిపిస్తోంది
This post was last modified on November 27, 2023 10:54 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…