కొంచెం లేటుగా సంక్రాంతి రేసులోకి వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ను పండక్కి రిలీజ్ చేసే విషయంలో చాలా పట్టుదలతో ఉన్నట్లే కనిపించాడు నిర్మాత దిల్ రాజు. కానీ ఆయన ప్రణాళికలు ఫలించలేదు. సినిమాలో కీలకమైన ఫారిన్ షెడ్యూల్ అనుకున్నట్లుగా జరగకపోవడంతో సంక్రాంతి డేట్‌ను అందుకోవడం కష్టమని తేలిపోయింది. అసలే పోటీ ఎక్కువ. అలాంటి సీజన్ కోసం హడావుడి పడి ఔట్ పుట్ దెబ్బ తింటే అసలుకే మోసం వస్తుందని ‘ఫ్యామిలీ స్టార్’ టీం వెనక్కి తగ్గింది. సంక్రాంతికి ఈ సినిమా రావడం లేదన్నది స్పష్టం.
ఐతే నేరుగా ఈ విషయాన్ని ప్రకటించకుండా.. కొత్త డేట్ ఖాయం చేసుకుని అప్పుడే అనౌన్స్‌మెంట్ ఇవ్వాలని టీం చూస్తోంది. సంక్రాంతి మిస్సయితే ఆటోమేటిగ్గా దృష్టి వేసవి మీదికే మళ్లుతుంది. దిల్ రాజు లాటి తెలివైన నిర్మాత.. సంక్రాంతి తర్వాత మొదలయ్యే డ్రై డేస్‌లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకోడు.
ఐతే వేసవిలో ఏప్రిల్ ఆరంభం నుంచే భారీ చిత్రాల సందడి మొదలైపోతుంది. కాబట్టి వేసవి ఆరంభంలోనే సినిమాను రిలీజ్ చేసేయాలని దిల్ రాజు చూస్తున్నాడు. మార్చి మధ్యలోనే ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. ఇందుకోసం సరైన డేట్ చూసుకుని త్వరలోనే ప్రకటన చేయబోతున్నారట.
వేసవికి పోటీ ఎక్కువ కాబట్టి కొంచెం ముందే సినిమాను రిలీజ్ చేస్తే ఇబ్బంది ఉండదని.. ఏప్రిల్ తర్వాత ఏ డేట్ ఎంచుకున్నా కష్టమే అని దిల్ రాజు ఆలోచిస్తున్నారట. సినిమా కూడా జనవరికల్లా రెడీ అయిపోతుంది కాబట్టి తాపీగా ప్రమోషన్లు చేసుకుని మార్చి మూడో వారంలో సినిమాను రిలీజ్ చేయాలని టీం భావిస్తున్నట్లు సమాచారం. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మధ్యే రిలీజైన టీజర్‌కు మంచి స్పందనే వచ్చింది.
This post was last modified on November 27, 2023 7:39 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…