ప్రస్తుతం ఇండస్ట్రీలో రివ్యూల మీద ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఇటీవలే కోట బొమ్మాళి పీఎస్ ప్రెస్ మీట్ లో దీని గురించి ఓ రేంజ్ లో రాద్ధాంతం జరిగినంత పనైంది. ఆదికేశవ ఈవెంట్ లోనూ డిస్కషన్ నడిచింది. రేటింగ్స్, రివ్యూలు వీడుదల రోజే రావడం వల్ల రెవిన్యూల మీద ప్రభావం పడుతోందని వాటిని ఆలస్యం చేయాలని ఒకరు, వాడుతున్న భాష సరిగా లేదని వేరొకరు ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ కు ఖచ్చితంగా వస్తారని తెలిసి కూడా వాదోపవాదాలు జరగడం పట్ల సోషల్ మీడియాలోనూ రియాక్షన్స్ కనిపించాయి.
తాజాగా నితిన్ రివ్యూల పట్ల తన మనోగతాన్ని ఓపెన్ గా పంచుకున్నాడు. మా సైట్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. రివ్యూలు రావడం వల్ల చాలా మంది దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారని, లేదంటే లాజిక్స్ ని గాలికి వదిలేసి, ఎవరు అడుగుతారనే ధీమాలో ఉండేవారని అన్నాడు. ఫలానా సీన్ లో నటిస్తున్నప్పుడు దాంట్లో ఉన్న లోపం రేపు ఏ రివ్యూయర్ అయినా పసిగడతారనే టెన్షన్ ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. హిట్ అయినప్పుడు పోస్టర్లలో రేటింగ్స్ వేసుకున్నప్పుడు ఫ్లాప్ అయితే మూసుకుని ఉండాలనేది నితిన్ లాజిక్.
ఇంత బహిర్గతంగా రివ్యూలను సమర్ధించిన హీరో నితినేనని చెప్పొచ్చు. డిసెంబర్ 8 విడుదల కాబోతున్న ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్ల కోసం నితిన్ యాక్టివ్ అయ్యాడు. వరస ఇంటర్వ్యూలతో పాటు ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్రాలు ప్లాన్ చేసుకున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ వినోదమే ప్రధానంగా నడుస్తుంది తప్ప అవసరం లేని మాస్ ని ఇరికించే ప్రయత్నం చేయలేదని చెప్పాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ కు ఒక రోజు ముందు నాని హాయ్ నాన్న పోటీ ఇస్తోంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్ తప్పుకున్నాయి.
This post was last modified on November 27, 2023 1:16 pm
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…