ఒక రీజనల్ సినిమా మీద పెద్దగా అంచనాలు లేకుండా ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ కావడం చాలా అరుదు. అందులోనూ బడ్జెట్ తక్కువగా పెట్టిన చిత్రాలకు. కానీ కాంతార ఈ ట్రెండ్ ని నిలువునా బ్రేక్ చేసింది. కన్నడలో ముందు రిలీజై రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో వచ్చినా కూడా ఒరిజినల్ కు ఏ మాత్రం తీసిపోని బ్లాక్ బస్టర్ సాధించడం విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం 16 కోట్లతో తీస్తే వందల కోట్లు వచ్చి పడ్డాయి. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 రాబోతోంది. ఈ సందర్భంగా హోంబాలే ఫిలిమ్స్ అనౌన్స్ మెంట్ ని టీజర్ రూపంలో విడుదల చేశారు.
మొత్తం ఏడు భాషల్లో కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 రాబోతోంది. కాన్సెప్ట్ ఎక్కువ రివీల్ చేయలేదు కానీ వెలుగు చూపించని రహస్యాలు ఎన్నో చీకట్లో బయట పడతాయని, వాటిని చూసి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పే సందేశం వినిపించారు. కదంబాలు రావడానికి ముందు జరిగిన కథను ఇందులో ఆవిష్కరించబోతున్నారు. రిషబ్ శెట్టి కాల రుద్రుడిగా ఉగ్ర రూపంలో కనిపించడం భీతి గొలిపేలా ఉంది. చేతిలో త్రిశూలం, కళ్ళలో రౌద్రం నిండి, కోపంగా చూస్తున్న ఎక్స్ ప్రెషన్ తో ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. స్టోరీకి సంబంధించి ఇంతకు మించి ఎక్కువ చెప్పలేదు.
విరూపాక్ష, మంగళవారంలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన అజనీష్ లోకనాథ్ మరోసారి కాంతారకు లైఫ్ ఇచ్చే బిజిఎంతో ఆకట్టుకోబోతున్నాడు. రెండు మూడు విజువల్స్ మాత్రమే చూపించినా డెప్త్ కనిపిస్తోంది. ఈసారి బడ్జెట్ భారీగా కేటాయించబోతున్నారు. రెండు వందల కోట్ల దాకా ఉండొచ్చని బెంగళూరు టాక్. ఫస్ట్ పార్ట్ తో పోల్చుకుంటే దానికి పదింతలు షాకింగ్ కంటెంట్ తో కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట. తెలుగు, హిందీ, కన్నడ, తమిళంతో కలిపి మొత్తం ఏడు భాషల్లో కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 రానుంది. విడుదల తేదీని ప్రకటించలేదు. 2024 చివరిలో ఉండొచ్చు.
This post was last modified on November 27, 2023 12:55 pm
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…
ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప’ కార్చిచ్చు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్లు మొదలు పొలిటిషియన్ల వరకు ‘పుష్ప’గాడి ఫైర్ కు ఫిదా…