Movie News

కుర్చీల అంచున 18 నిమిషాల విశ్రాంతి

ఇంకో అయిదు రోజుల్లో థియేటర్లో అడుగు పెట్టబోతున్న యానిమల్ కోసం ప్రేక్షకుల ఎదురు చూపులు మాములుగా లేవు. హిందీ తర్వాత ఆ స్థాయి బజ్ తెలుగు రాష్ట్రాల్లోనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇవాళ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు, రాజమౌళి హాజరయ్యాక ఇది నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయమే. తాజాగా చెన్నైలో ప్రమోషన్ చేసుకుని వచ్చిన ఈ టీమ్ నుంచి కొన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ చాలా హాట్ గా ఉన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ చెబుతున్న దాని ప్రకారం ఏకధాటిగా 18 నిమిషాల పాటు ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుందట.

ఇంత సుదీర్ఘమైన విశ్రాంతి ఘట్టం గతంలో ఏ సినిమాలోనూ వచ్చినట్టు లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రన్బీర్ కపూర్ సిక్కుల గెటప్పులో ఉన్న అనుచరులను తీసుకొచ్చి మెషీన్ గన్ తో సృష్టించే విధ్వంసం దీని గురించేననట. సూటు బూటుకి భిన్నంగా తెల్లని లాల్చీతో దుస్తుల నిండా రక్తం పూసుకుని హీరో చేసే అరాచకం మాటల్లో వర్ణించలేమని అంటున్నారు. ప్రణయ్ కేవలం నిడివి గురించి మాత్రమే చెప్పగా టీమ్ నుంచి అందుతున్న అనఫీషియల్ లీక్స్ అంతకు మించి ఉన్నాయి. సుప్రీమ్ సుందర్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ హాలీవుడ్ స్టాండర్డ్ ని మించే ఉంటుందట.

ఇంతగా ఊరిస్తే మొదటిరోజు చూడకుండా ఉండటం కష్టమే. సందీప్ వంగా ఇంటర్వ్యూలతో పాటు పక్కా ప్లానింగ్ తో టి సిరీస్, భద్రకాళి బ్యానర్లు సంయుక్తంగా చేస్తున్న పబ్లిసిటీ యానిమల్ కి కోరుకున్న దానికన్నా ఎక్కువ హైప్ తెచ్చేసింది. మల్టీప్లెక్సుల టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. సల్మాన్ ఖాన్ టైగర్ 3కి ఇంత దూకుడు చూడలేదని బయ్యర్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఉదయం ఆటకు పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం బాక్సాఫీస్ ఉచకోత మాములుగా ఉండదు. రష్మిక మందన్న, అనిల్ కపూర్, పృథ్వి, శక్తి కపూర్ ఇతర ప్రధాన తారాగణం కాగా బాబీ డియోల్ విలనీకి చాలా క్రేజ్ వచ్చేసింది.

This post was last modified on November 27, 2023 10:59 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago