Movie News

ఆదికేశవ రిజల్ట్.. ముందే తెలిసిపోయిందా?

‘ఉప్పెన’ లాంటి వంద కోట్ల సినిమాతో పరిచయం అయిన హీరో.. వరుసగా బ్లాక్‌బస్టర్లు కొడుతున్న హీరోయిన్.. పేరున్న నిర్మాణ సంస్థ.. షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి పేరు తెచ్చుకుని మెగా ఫోన్ పట్టిన ఓ కొత్త దర్శకుడు.. ఇలాంటి కాంబినేషన్లో సినిమా మార్నింగ్ షోతోనే డిజాస్టర్ అని తేలిపోవడం.. బాక్సాఫీస్ దగ్గర మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘ఆదికేశవ’ పరిస్థితి ఇదే.

వీకెండ్లో ఈవెనింగ్ షోలకు కూడా జనాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న పరిస్థితి. ప్రేక్షకులు నిర్మొహమాటంగా ఈ సినిమాను తిరస్కరించారన్నది స్పష్టం. నిజానికి ‘ఆదికేశవ’ టీంలో కూడా రిలీజ్ ముంగిట సినిమాపై ఎలాంటి నమ్మకాలు కనిపించలేదు. స్వయంగా నిర్మాత నాగవంశీ మాట్లాడిన మాటలు రిజల్ట్ ఏంటో చెప్పకనే చెప్పేశాయి. సినిమా కొత్తగా ఉండదని.. కానీ ఎంటర్టైన్ చేస్తుందని ఏదో మొక్కుబడిగా కొన్ని మాటలు మాట్లాడాడు.

‘మ్యాడ్’ అనే చిన్న సినిమా మీద చూపించిన కాన్ఫిడెన్స్ ‘ఆదికేశవ’ మీద ఆయనకు లేకపోయింది. దీపావళికి తమిళ అనువాదాల పోటీకి భయపడి సినిమాను వాయిదా వేసినపుడే ‘ఆదికేశవ’ విషయంలో ఏదో తేడా ఉందని అర్థమైంది. ఈ సినిమా ప్రమోషన్లకు శ్రీలీల రాలేదు.

హీరో, డైరెక్టర్ ఇద్దరూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ కనిపించలేదు. ఇక రిలీజ్ తర్వాత అయితే ‘ఆదికేశవ’ టీం నుంచి అస్సలు సౌండ్ లేదు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ల జోలికే వెళ్లలేదు. ఏం చేసినా సినిమాను లేపలేమని అర్థం చేసుకుని టీం సైలెంట్‌గా ఉంది.

చూస్తుంటే ఫస్ట్ కాపీ చూడగానే సినిమా రిజల్ట్ ఏంటో అర్థమైపోయి అందుకు తగ్గట్లే టీం వ్యవహరించినట్లు కనిపిస్తోంది. నిజానికి స్క్రిప్టు విన్నపుడే ఈ సినిమా ఫలితాన్ని అంచనా వేసి ఉండాలి. కానీ నిర్మాతగా మంచి టేస్ట్, జడ్జిమెంట్ ఉన్న నాగవంశీ.. ఇందులో నిర్మాణ భాగస్వామి కూడా అయిన త్రివిక్రమ్.. ఎలా ఓకే చేసి ఈ సినిమా మీద ఇంత ఖర్చు పెట్టారన్నదే అర్థం కాని విషయం.

This post was last modified on November 26, 2023 8:51 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago