పేరుకి తమిళ హీరోలే అయినా తెలుగు ఆడియెన్సు లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సూర్య, తమ్ముడు కార్తీల మీద ఒక డైరెక్టర్ వల్ల వివాదాస్పద చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల ప్రారంభంలో జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కార్తీతో పని చేసిన పాతిక దర్శకులను ఆ వేడుకకు ఆహ్వానించారు. అయితే మొదటి చిత్రం పరుత్తివీరన్(మల్లిగాడు) తీసిన అమీర్ కు పిలుపు వెళ్ళలేదు. దీనికి కారణం ఏంటని నిర్మాత జ్ఞానవేల్ రాజాని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దీనికాయన సమాధానమిస్తూ అమీర్ బడ్జెట్ ని ఎక్కువ చూపించి డబ్బులు దుర్వినియోగం చేశాడని చెప్పుకొచ్చాడు.
దీంతో అమీర్ తీవ్రంగా స్పందించారు. షూటింగ్ సగం కాకుండానే జ్ఞానవేల్ రాజా మాయమైపోతే తాను స్నేహితులందరి దగ్గర అప్పు చేసి పూర్తి చేశానని, ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా తన మీద ఆరోపణలు చేయడం దారుణమని వివరణ ఇచ్చాడు. అమీర్ కు మద్దతగా నటుడు సముతిరఖని సుదీర్ఘంగా ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను ఆరునెలలు పరుత్తి వీరన్ సెట్స్ లో ఉన్నానని, ఏనాడూ జ్ఞానవేల్ రాజాని చూడలేదని చెప్పడం కాంట్రావర్సిని కొత్త మలుపు తిప్పింది. మరో హీరో, దర్శకుడు శశికుమార్ సైతం బడ్జెట్ లో చేయి వేసి ఆదుకున్నాడని గుర్తు చేశాడు.
సాంకేతికంగా పరుత్తివీరన్ కు జ్ఞానవేలే నిర్మాత. అమీర్ డబ్బులు పెట్టినా కూడా హక్కులు ఆయనవి కాదు. అయితే సినిమా ఊహించిన దానికన్నా గొప్ప విజయం సాధించడం, జాతీయ అవార్డు రేంజ్ కి చేరుకోవడంతో ఒక్కసారిగా కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. కార్తీలో అంత గొప్ప పెర్ఫార్మర్ ఉన్నాడని ప్రపంచానికి చెప్పింది అమీరే. జ్ఞానవేల్ రాజా, అమీర్ లకు మధ్య ఇంత గొడవ జరుగుతుంటే కార్తీ, సూర్యలు మాత్రం ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు. పరుత్తివీరన్ తెలుగులో మల్లిగాడుగా డబ్ చేసి థియేటర్ రిలీజ్ చేశారు కానీ ఇక్కడ ఆడలేదు. తర్వాత శాటిలైట్, ఓటిటి ఎక్కడా అందుబాటులో లేదు.
This post was last modified on November 26, 2023 8:19 pm
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…