బూరెల బుట్టలో పడ్డ గోపిచంద్ మలినేని

ఎక్కడో సుడి ఉంటే నేరుగా బూరెల బుట్టలో పడినట్టు ఉంది దర్శకుడు గోపిచంద్ మలినేని పరిస్థితి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న రవితేజ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ఇష్యూస్ వల్లే వాయిదా వేశారనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక వార్త రాలేదు. సరే ఇప్పుడు మాస్ మహారాజా స్థానంలో ఇంకో సీనియర్ హీరోతో తీయాలనే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగానే ఇదే ప్రాజెక్టు తమిళ స్టార్ హీరో అజిత్ తో తీసే అవకాశం బలంగా ఉందని ఇన్ సైడ్ టాక్.

నిజానికి మైత్రికి అజిత్ ఓ కమిట్ మెంట్ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే అది మార్క్ ఆంటోనీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్ అనేది నిన్నటి దాకా వినిపించిన చెన్నై టాక్. అనూహ్యంగా ఇప్పుడు గోపిచంద్ మలినేని పేరు తెరపైకి వచ్చింది. చాలా పవర్ ఫుల్ కథ తయారు చేశారని, అయితే ఇది మీడియం రేంజ్ హీరోతోనో లేదా తక్కువ వయసున్న హీరోతో చేస్తే వర్కౌట్ కాదనే ఉద్దేశంతో అజిత్ కి చెప్పి ప్రాధమికంగా ఓకే చేయించుకున్నారని వినికిడి. మరి అధిక్ రవిచంద్రన్ ది ఏమైంది అంటే వేరే సంస్థలో తర్వాత ఇంకెప్పుడైనా ఈ కలయిక ఉండొచ్చట. 

ఇది కార్యరూపం దాలిస్తే మలినేని పెద్ద జాక్ పాట్ కొట్టినట్టే. ఎందుకంటే రవితేజది మిస్ కావడం వల్ల పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే తనతో ఆల్రెడీ మూడు బ్లాక్ బస్టర్లున్నాయి. డాన్ శీను, బలుపు, క్రాక్ తో ఓటమి లేని కాంబినేషన్ అందుకున్నాడు. సో అజిత్ తో చేయడం వల్ల కొత్త మార్కెట్ ఏర్పడుతుంది. సరిగ్గా హిట్టు కొడితే ఇతర కోలీవుడ్ స్టార్ల నుంచి పిలుపు అందుకోవచ్చు. కాకపోతే వారసుడు విషయంలో వంశీ పైడిపల్లి చేసిన పొరపాట్లు లాంటివి రాకుండా చూసుకోవాలి. అఫీషియల్ అయ్యేదాకా ఏదీ ఖరారుగా చెప్పలేం కానీ మైత్రి నిర్మాతలు మాత్రం దీని మీద సీరియస్ గానే వర్క్ చేస్తున్నారు. 

This post was last modified on November 26, 2023 5:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాదుకి పనికొచ్చే బేబీ జాన్ పొరపాట్లు !!

పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…

14 minutes ago

రేపు సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన…

24 minutes ago

నవీన్ సినిమా ఆగిపోలేదు.. కానీ

నవీన్ పొలిశెట్టిని స్క్రీన్ మీద చూసి ఏడాది దాటిపోయింది. తన చివరి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ గత…

40 minutes ago

పెళ్లయి పిల్లలున్న బోనీ.. శ్రీదేవికి ప్రపోజ్ చేస్తే?

అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుని కోట్లాది మంది కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన శ్రీదేవి.. అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్‌ను…

2 hours ago

ఎవ్వరూ నోరు తెరవొద్దు.. ‘మా’ సభ్యులతో విష్ణు

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మంచు ఫ్యామిలీ గొడవ.. మరోవైపు సంధ్య…

2 hours ago

రేవతి కుటుంబానికి పుష్ప టీం రూ.2 కోట్ల ఆర్థిక సాయం

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హీరో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి…

3 hours ago