ఇప్పుడు టాలీవుడ్‌లో ‘బి ది రియల్ మ్యాన్’ ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి మొదలెట్టిన ఈ ఛాలెంట్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి మీదుగా ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్… ఇలా స్టార్లలందరినీ తాకింది. ఇంట్లో అన్ని రకాల పనులు చేస్తూ స్టార్ హీరోలు వీడియోలు పెడుతూ, తమ అభిమానులను అలరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ మరి మిగిలిన హీరోల సంగతేంటి?
టాలీవుడ్‌లో చాలామంది యంగ్ హీరోలు ఇలాంటి ఛాలెంజ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారట. ఇంట్లో పనులన్నీ చేస్తూ… వీడియోలు షూట్ చేసుకుని… ఎవరు ఛాలెంజ్ చేస్తారా? ఎప్పుడు వీడియోను వదులుదామా? అని వెయిట్ చేస్తున్నారని టాక్.
ఎవ్వరూ ఛాలెంజ్ చేయకుండా వీడియో రిలీజ్ చేస్తే, ఫ్యాన్స్ ముందు చులకన అయిపోతామని… అందుకే ఏ స్టార్ హీరో అయినా తమ పేరు పలకబోతాడా? అని వీడియోలు రెఢీగా పెట్టుకుని, అప్‌లోడ్ చేయడానికి సరైన సమయం చూస్తున్నారట.
చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు ఎవ్వరైనా… ‘తెలుగు యంగ్ హీరోలందరూ ఈ ఛాలెంజ్ స్వీకరించి, వీడియోలు పెట్టాలి’ అని ఛాలెంజ్ వేయకపోరా… ఆ వెంటనే వీడియోను రిలీజ్ చేసేద్దామని ప్లాన్‌తో ఉన్నారట.
అయితే మరికొందరు యంగ్ హీరోలు మాత్రం ఈ ఛాలెంజ్‌తో సంబంధం లేకుండా తమకోసం ఓ కొత్త ఛాలెంజ్ క్రియేట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నారట. ఇప్పటికే హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ వెరైటీ వేషాలతో ఛాలెంజ్ చేస్తున్నట్టు, ఏదైనా క్రియేటివ్ ఛాలెంజ్‌తో వీడియో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. లాక్‌డౌన్ కారణంగా యంగ్ హీరోల క్రియేటివిటీకి బాగానే పని పడినట్టుంది.
This post was last modified on April 26, 2020 9:36 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…