Movie News

మెషీన్ గన్ సెంటిమెంట్.. మామూలుగా లేదు

ఏ ముహూర్తాన ‘ఖైదీ’ సినిమాలో కార్తి క్లైమాక్స్ ఎపిసోడ్లో మెషీన్ గన్ పట్టి రెచ్చిపోయాడో ఇక అప్పట్నుంచి అదొక సెంటిమెంట్‌గా మారిపోయింది. తర్వాత పలు చిత్రాల్లో ఈ మెషీన్ గన్ సెంటిమెంట్‌ను రిపీట్ చేశారు. ‘ఖైదీ’ తీసిన లోకేష్ కనకరాజే తర్వాత ‘విక్రమ్’లోనూ హీరో కమల్ హాసన్‌తో ఇంకా పెద్ద మెషీన్ గన్ పట్టించి విధ్వంసం సృష్టించాడు. అది కూడా బ్లాక్‌బస్టర్ అయింది. ఆపై మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో, తమిళ హీరో విశాల్ ‘మార్క్ ఆంటోనీ’లో మెషీన్ గన్స్ పట్టి రెచ్చిపోయారు. అవి కూడా మంచి ఫలితాలందుకోవడంతో సెంటిమెంట్ మరింత బలపడింది.

ఇటీవల ‘భగవంత్ కేసరి’ సినిమాలో దీని మీద ఒక జోక్ కూడా పెట్టాడు అనిల్ రావిపూడి. ఈ గన్ను మార్కెట్లో పాపులర్ అంటే.. మనకి ఈ సౌండ్ సరిపోదని గ్యాస్ సిలిండర్లను ప్రయోగించాడు బాలయ్య. కట్ చేస్తే ఇప్పుడు ‘యానిమల్’ సినిమాలోనూ ఈ మెషీన్ గన్ సెంటిమెంట్ రిపీట్ కావడం విశేషం.

‘యానమిల్’ ట్రైలర్లో ఒక షాట్లో హీరో రణబీర్ కపూర్ మెషీన్ గన్నుతో మామూలుగా రెచ్చిపోలేదు. ఇప్పటిదాకా చూసిన గన్స్ కంటే ఇది భారీగా, అడ్వాన్స్డ్ లెవెల్లో కనిపించింది. ఈ సినిమాలో ఇలాంటి షాట్ ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. స్టీరియో టైప్స్ బ్రేక్ చేస్తాడని పేరున్న సందీప్ రెడ్డి కూడా ఈ మెషీన్ గన్ సెంటిమెంట్‌కు పడిపోయాడే.. వేరే సినిమాలను అనుకరించాడే అనే చర్చ జరుగుతోంది.

ఇది సందీప్ అభిమానులకు కొంత నిరాశ కలిగించినా.. ఓవరాల్‌గా సక్సెస్ సెంటిమెంట్ కంటిన్యూ అయి ‘యానిమల్’ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనే ఆశతో ప్రేక్షకులు కనిపిస్తున్నారు. ‘యానిమల్’ డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on November 23, 2023 8:29 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago