బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమాలన్నీ బుల్లితెరపై కూడా అదే స్థాయి సంచలనాలు నమోదు చేస్తాయన్న గ్యారెంటీ లేదు. దానికి ఈ మధ్య చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు డిజాస్టర్లకు భారీ స్పందన దక్కుతోంది. ఆదిపురుష్ అన్ని విమర్శలపాలైనా తెలుగులో శాటిలైట్ ప్రీమియర్ జరుపుకున్నప్పుడు 9 పైగా రేటింగ్ తెచ్చుకుని ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ ఇమేజ్, రాముడి సెంటిమెంట్ లాంటి కారణాలు ఎన్ని ఉన్నా టీవీలో అదరగొట్టిన మాట వాస్తవం. కానీ విచిత్రంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన జైలర్ కు మాత్రం రివర్స్ జరిగింది.
ఇటీవలే వరల్డ్ ప్రీమియర్ జరుపుకున్న జైలర్ తెలుగు వెర్షన్ కు అర్బన్ 6.3, అర్బన్ రూరల్ కలిపి 5.4 టిఆర్పి నమోదు కావడం గమనార్హం. నిజానికిది చాలా తక్కువనే చెప్పాలి. వీరసింహారెడ్డి, బలగం లాంటి బ్లాక్ బస్టర్లు ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 8కి పైగా రాబడితే టాలీవుడ్ లోనూ భీభత్సంగా ఆడిన జైలర్ కి తక్కువ నెంబర్ రావడం అనూహ్యం. అయితే తమిళంలో ఇలా ఉండదు లెండి. కనిష్టంగా ఇరవైకి పైగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన అరుణాచలంని గత ఏడాది దీపావళికి ప్రత్యేకంగా ప్రసారం చేస్తే పదిహేనుకి పైగానే తెచ్చుకుని షాక్ ఇచ్చింది.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. థియేటర్లో విరగాడిన సినిమాలు వీలైనంత త్వరగా టీవీలో వచ్చేయాలి. ఓటిటి, లోకల్ కేబుల్, పైరసీ సైట్స్ ఇలా రకరకాల మార్గాల్లో ఆడియన్స్ చూసేందుకు ఆప్షన్లు ఉన్నప్పుడు అదే పనిగా యాడ్స్ ని భరిస్తూ టీవీలో చూసేందుకు ప్రేక్షకులు ఎదురు చూడటం లేదు. ఇంకా అధిక శాతం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఓటిటి విప్లవం తీవ్రంగా లేదు కాబట్టి టీవీ ఛానల్స్ మార్కెట్ ని నెట్టుకొస్తున్నాయి. భవిష్యత్తులో ఇదింకా కిందకే వెళ్తుంది. అందుకే నిర్మాతలు డిజిటల్ ఆదాయం మీద పెట్టిన దృష్టి శాటిలైట్ మీద పెట్టడం లేదు. రేటింగ్స్ ప్రూవ్ చేస్తోంది కూడా ఇదే.
This post was last modified on November 23, 2023 2:33 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…