ఒక సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజయ్యాక దానికి కొనసాగింపైనా సరే అందులోనే చూడాలనే నమ్మకాన్ని నిలువునా బ్రేక్ చేసి విజయం సాధించిన సినిమా మా ఊరి పొలిమేర 2. కంటెంట్ లో హెచ్చుతగ్గులు, క్యాస్టింగ్ లో స్టార్లు లేకపోవడం, బడ్జెట్ పరిమితులు ఇలా అన్ని అడ్డంకులు దాటుకుని ఇరవై కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా బిసి సెంటర్ల వసూళ్లు బయ్యర్లు ఊహించలేదు. దెబ్బకు నిర్మాతలు ఇప్పుడు మూడో భాగాన్ని రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని డిసైడయ్యారు. ఆ మేరకు ప్లానింగ్ కూడా జరిగి ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నారు.
ఇప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొన్ని చిత్రాలు ఇదే బాట పట్టనున్నాయి. గత ఏడాది ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన భామా కలాపం ఆహా ప్లాట్ ఫార్మ్ మీద మంచి విజయం సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో వంటల వీడియోలు చేసే ఒక సాధారణ గృహిణి పెద్ద క్రైమ్ లో ఇరుక్కుని క్రిమినల్స్ కే ముచ్చెమటలు పోయించడం అందులో మెయిన్ పాయింట్. దర్శకుడు అభిమన్యు దాన్ని హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు భామా కలాపం 2ని తీస్తున్నారు. అయితే ఇది మాత్రం థియేటర్లలో వస్తుందని అధికారికంగా ప్రకటించారు.
ఇది ఒకరకంగా మంచి ట్రెండ్. ఓటిటి ఆదాయం మత్తులో పడి ముందు వెనుకా చూసుకోకుండా బడ్జెట్ లు పెంచేస్తున్న నిర్మాతలు ఇకనైనా థియేటర్ మార్కెట్ ని సీరియస్ గా తీసుకుంటారు. దీని రెవిన్యూని తేలిగ్గా తీసుకుంటే ఎంతటి పరిణామాలు ఎదురవుతాయో గత వారం రోజులుగా ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. వీటి వల్ల రెండు మూడు సెట్ల మీదకు వెళ్లాల్సిన మీడియం బడ్జెట్ సినిమాలు ఆగిపోయాయి కూడా. అందుకే భామా కలాపం ప్రొడ్యూసర్లు తెలివిగా నిర్ణయం మార్చుకున్నారు. ఈసారి దొంగతనం కాన్సెప్ట్ ని కూడా జోడించినట్టు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అదే టీమ్ పని చేయనుంది.
This post was last modified on November 23, 2023 12:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…