స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లు చేయడం హిందీలో సహజమే కానీ తెలుగులో ఈ ట్రెండ్ మొదలుపెడుతోంది మాత్రం నాగ చైతన్యనే. అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ తో రూపొందించిన దూత డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతోంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో క్రైమ్ కం సెమి హారర్ జానర్ లో రూపొందిన దూతకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించడం అంచనాలు పెంచుతోంది. చైతు ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పలు ప్రోగ్రాంలు చేస్తున్నాడు. దూతను వీలైనంత ఎక్కువగా ఆడియన్స్ కి చేర్చాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
సమాచార్ దినపత్రికలో పని చేసే సాగర్(నాగ చైతన్య) జర్నలిస్టు అంటే సమాజానికి ఒక బాధ్యతతో ఉండాల్సిన దూతగా భావిస్తుంటాడు. అయితే పలు న్యూస్ పేపర్లలో వచ్చే కటింగ్స్, కార్టూన్స్ ఆధారంగా కొన్ని హత్యలు జరుగుతున్నాయని తెలిసి షాక్ తింటాడు. స్వంత కుటుంబాన్నే రిస్క్ లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే సాగర్ భయపడకుండా ఈ మిస్టరీని ఛేదించేందుకు బయలు దేరతాడు. ఒక నేరం తన మీదే పడి పద్మవ్యూహంలో చిక్కుంటుంటాడు. జనాలకు దూతగా ఉండాల్సిన ఒక విలేఖరి ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయట పడ్డాడో తెలియాలంటే లెన్తీ సిరీస్ కి రెడీ అవ్వాలి.
క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దూత రూపొందిన విషయాన్ని వీడియోలో చెప్పేశారు. చైతుకి ఇలాంటి పాత్ర చేయడం కొత్త. డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ప్రచి దేశాయ్, పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్, రవీంద్ర విజయ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఒక చీకటి నేర ప్రపంచంలో విక్రమ్ కె కుమార్ తీసుకెళ్లబోతున్నాడు. కంటెంట్ షాకింగ్ గా ఉండబోతోందనే హింట్ అయితే స్పష్టంగా ఇచ్చారు. దూత ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే దాన్ని బట్టి మిగిలిన హీరోలో ఈ రూటు పట్టే అవకాశం లేకపోలేదు. వచ్చే వారం దాకా ఆగాలి మరి.
This post was last modified on November 23, 2023 10:35 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…