ఈ క్రిస్మస్‌కు భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది డంకీ. ఇప్పటికే ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ లాంటి బ్లాక్‌బస్టర్లతో మాంచి ఊపుమీదున్నాడు. అలాంటి హీరో ఇప్పటిదాకా అన్నీ బ్లాక్‌బస్టర్లే తీసిన రాజ్ కుమార్ హిరానితో జట్టు కడుతుండటంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది.
సలార్ లాంటి భారీ చిత్రంతో పోటీకి సై అన్నారంటే ఈ చిత్రం మీద మేకర్స్‌కు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనికి బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ గురించి ఇప్పుడు బయటికి వచ్చిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కాంబినేషన్ చూసి వందల కోట్లు పెట్టి ఉంటారని అనుకుంటాం కానీ.. డంకీ బడ్జెట్ కేవలం రూ.80 కోట్లు మాత్రమేనట.
డంకీ సినిమాను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌తో కలిసి రాజ్ కుమార్ హిరానియే నిర్మించాడు. ఇటు షారుఖ్, అటు హిరాని ఇద్దరూ కూడా ఈ సినిమాకు పారితోషకాలు తీసుకోకుండా.. లాభాల్లో వాటాను పంచుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కేవలం ప్రొడక్షన్ మీదే పెట్టుబడి అంతా పెట్టారు. ఆ ఖర్చు రూ.80 కోట్లు మాత్రమేనట. ఇందులోనే మిగతా పారితోషకాలు కూడా ఉన్నాయి.
హీరో, డైరెక్టర్ పారితోషకాలు తీసేసినా కూడా.. రూ.80 కోట్లంటే తక్కువ బడ్జెట్ అన్నట్లే. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌కి రూ.500 కోట్లకు తక్కువగా బిజినెస్ అయ్యే అవకాశం లేదు. ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చినా రావచ్చు. లాభాలే ఐదొందల కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీన్ని బట్టి షారుఖ్, హిరాని ఏ స్థాయిలో లాభ పడతారో అంచనా వేయొచ్చు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 22న డంకీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 23, 2023 6:28 am
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…