Movie News

త‌డిసి మోపెడ‌వుతున్న పుష్ప బ‌డ్జెట్

ప్ర‌స్తుతం ఇండియాలో తెర‌కెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో పుష్ప: ది రూల్ ఒక‌టి. రెండేళ్ల కింద‌ట వ‌చ్చిన పుష్ప‌: ది రైజ్ పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. సెకండ్ పార్ట్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అవి అంతకంత‌కూ పెరుగుత‌న్నాయే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. ఈ అంచ‌నాల‌ను అందుకోవ‌డానికి సుకుమార్ అండ్ టీం మామూలుగా క‌ష్ట‌ప‌డ‌ట్లేద‌న్న‌ది చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

ఆల్రెడీ సిద్ధంగా ఉన్న స్క్రిప్టుకు మెరుగులు దిద్దుకుని.. ఇంకా పెద్ద స్థాయికి సినిమాను తీసుకెళ్ల‌డం కోసం త‌న టీంతో సుకుమార్ చాలానే క‌స‌ర‌త్తు చేశాడు. ప్రి ప్రొడ‌క్ష‌న్ కూడా భారీ స్థాయిలోనే జ‌రిగింది. సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌డానికి ముందే కొన్ని కోట్లు ఖ‌ర్చ‌య్యాయి. ఇక షూటింగ్ మొద‌ల‌య్యాక ఖ‌ర్చు మామూలుగా లేద‌ని స‌మాచారం.

చిన్న చిన్న సీన్లు తీయ‌డానికి కూడా వారాల‌కు వారాలు స‌మ‌యం ప‌డుతోంద‌ట‌. భారీ సెట్టింగ్స్ వేసి.. వంద‌లు వేల‌మందితో షూట్ చేస్తున్నారు. ముందుగా వీళ్లంద‌రితో రిహార్స‌ల్స్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత షూటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా గంగ జాత‌ర సీక్వెన్స్ అయితే ఒక రేంజ్‌లో తీస్తున్నార‌ట‌. దీని కోస‌మే 40-50 కోట్ల దాకా ఖ‌ర్చు వ‌చ్చేలా ఉంద‌ని స‌మాచారం. షూట్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి రూ.200 కోట్ల‌తో సినిమా తీయాల‌న్న‌ది ప్లాన్. కానీ ఇప్ప‌టికే అంచనా బ‌డ్జెట్ 50 శాతం పెరిగిపోయింద‌ట‌. సినిమా పూర్త‌య్యేస‌రికి ఇంకా బ‌డ్జెట్ పెరిగిపోయే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని చిత్ర వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఐతే సినిమాకు ఉన్న క్రేజ్, వ‌స్తున్న బిజినెస్ ఆఫ‌ర్లు చూస్తున్న నిర్మాత‌లు.. ఖ‌ర్చు గురించి అస్స‌లు వెనుకాడ‌కుండా.. ఎంత కావాలంటే అంత పెట్టేస్తున్నార‌ట‌. చివ‌రికి చూస్తే రాజ‌మౌళి సినిమా రేంజిలో బ‌డ్జెట్ తేలేలా ఉంద‌ట‌.

This post was last modified on November 23, 2023 6:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సల్మాన్ సినిమా పరిస్థితి ఎంత ఘోరమంటే?

బాలీవుడ్ ఆల్ టైం టాప్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ వస్తే చాలు.. వందల…

2 hours ago

కటవుట్ రికార్డు తాపత్రయం….ప్రమాదం తప్పిన అభిమానం

కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా…

3 hours ago

రాజ‌ధానిలో రైలు కూత‌లు.. నేరుగా క‌నెక్టివిటీ!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇప్పుడు ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారు.. విజ‌య‌వాడ‌కు వ‌చ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమ‌రావ‌తికి…

4 hours ago

అప్పుడు ఫైబ‌ర్ నెట్ ఇప్పుడు శాప్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాదికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ ర‌వినాయుడు.. వ‌ర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మ‌ధ్య ఇప్పుడు రాజ‌కీయం జోరుగా సాగుతోంది.…

5 hours ago

అమెరికా టారిఫ్‌… కేంద్రానికి చంద్ర‌బాబు లేఖ‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ప్ర‌పంచ దేశాల దిగుమ‌తుల‌పై భారీఎత్తున సుంకాలు (టారిఫ్‌లు)…

7 hours ago

భైరవం మంచి ఛాన్సులు వదిలేసుకుంది

అల్లుడు అదుర్స్ తర్వాత హిందీ ఛత్రపతి కోసం మూడేళ్లు టాలీవుడ్ కు దూరమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పుడు ప్రభాస్ రేంజ్…

8 hours ago