ప్రీ ప్రొడక్షన్ కోసమే చాలా టైం తీసుకుని దర్శకుడు చందూ మొండేటితో పాటు నెలల తరబడి లొకేషన్ హంట్ కి వెళ్లి ఎన్నో విషయాలు దగ్గరుండి మరీ నేర్చుకున్న నాగచైతన్య కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. నెలల క్రితమే తండేల్ అని లీకయ్యింది కానీ ఫైనల్ గా దాన్నే కన్ఫర్మ్ చేయడం బాగుంది. డిఫరెంట్ సౌండ్ తో పాటు చైతు లుక్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి. కండలు తిరిగిన దేహంతో కస్టడీకి పూర్తి భిన్నంగా గెడ్డం పెంచి రఫ్ లుక్ తో మాస్ టచ్ ఇచ్చాడు. తడాకా, ఆటోనగర్ సూర్య తర్వాత వాటిని మించిన కమర్షియల్ లుక్ ఇందులో కనిపిస్తోంది.
ఇక తండేల్ విషయానికి వస్తే కథ మొత్తం సముద్రం చుట్టూ తిరగనుంది. ఇండియా పాకిస్థాన్ బోర్డర్ మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్. తోటి జాలర్ల స్నేహితుల ప్రాణాలు శత్రుదేశంలో ప్రమాదంలో పడితే వాళ్ళను కాపాడేందుకు ఓ యువకుడు చేసే సాహసమే తండేలని వినికిడి. సినిమాలో అధిక శాతం సముద్రం పైన లేదా చుట్టూ జరుగుతుందని సమాచారం. హీరోయిన్ సాయిపల్లవికి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రనే ఇచ్చారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ కి ఎంత ప్లస్ అవుతుందో ఉప్పెనలోనే చూశాం.
తండేల్ లుక్ తో ఫ్యాన్స్ ని చైతు పూర్తిగా సంతృప్తి పరిచేశాడు. దూత స్ట్రీమింగ్ అయ్యాక షూటింగ్ ని వేగవంతం చేయబోతున్నారు. బడ్జెట్ ఎనభై కోట్లకు పైగా అవుతుందనే టాక్ ఉంది కానీ గీత ఆర్ట్స్ ఫిగర్స్ ని బయటికి చెప్పదు కాబట్టి స్క్రీన్ మీద చూశాక బడ్జెట్ పట్ల క్లారిటీ వస్తుంది. వరస పరాజయాలతో దెబ్బ తిన్న చైతుకి తండేల్ బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. అందుకే చందూ మొండేటి స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం డిమాండ్ చేసినా కూడా నో అనకుండా సహకరించాడు. పైగా మేకోవర్ కూడా అతను అడిగినట్టే పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. వచ్చే ఏడాది దసరాకు విడుదల చేసే అవకాశాలున్నాయి.
This post was last modified on November 22, 2023 3:02 pm
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…