సాధారణంగా స్టార్ హీరోల సినిమాల షూటింగులు ఆలస్యమవుతాయి కానీ హఠాత్తుగా బ్రేకులు పడటం అరుదు. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందబోయే భారీ చిత్రాన్ని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో ఇది నాలుగో మూవీ. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత మైత్రి బ్యానర్ నిర్మాణంలో మరోసారి చేతులు కలిపారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకావాల్సి ఉండగా హఠాత్తుగా బ్రేక్ వేశారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. నిన్న సాయంత్రం నిర్మాత నవీన్ పుట్టినరోజు జరిగిన గంటల్లోనే ఈ న్యూస్ వచ్చింది.
కారణాలు బడ్జెట్ ఇష్యూస్ గా పేర్కొంటున్నారు కానీ నిజానికి మైత్రిలో డబ్బు సమస్య లేదు. స్క్రిప్ట్ లో ఏదో అసంతృప్తిగా అనిపించడంతో పాటు ప్రొడక్షన్ పరంగా వ్యయాన్ని తగ్గించే అవసరాన్ని గుర్తించి కొంచెం పాజ్ ఇచ్చారట. మొత్తంగా ఆగిపోలేదని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఇదే సంస్థలో గోపిచంద్ మలినేని వీరసింహారెడ్డి ఇచ్చాడు. దానికీ వ్యయం కాస్త ఎక్కువే అయ్యిందని వార్తలొచ్చాయి. సినిమా హిట్టయ్యింది కాబట్టి సరిపోయింది. మళ్ళీ దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ రవితేజ వరస బ్లాక్ బస్టర్లలో లేడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వరసగా నిరాశపరిచాయి .
ఈ నేపథ్యంలో ఇంత పెద్ద హీరో రేపు సెట్స్ లో అడుగు పెట్టాల్సిన టైంలో ఇలా జరగడం ఊహించని పరిణామమే. క్రాక్ లాగే నిజ జీవితం సంఘటనలు ఆధారంగా చేసుకున్న మలినేని టీమ్ అయితే సెట్ చేసుకున్నాడు కానీ ఇంకా హీరోయిన్ దొరకలేదు. ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చినా ఇంకా ఫైనల్ కాలేదు. సో దీన్ని మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ చేస్తారనేది వేచి చూడాలి. ఈగల్ జనవరి 13 విడుదల కాబోతున్న నేపథ్యంలో రవితేజ మెల్లగా దాని ప్రమోషన్లలో భాగమయ్యేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఇప్పుడు మలినేనికి ఏదైనా గ్యాప్ ఇచ్చినట్టా లేక డిసెంబర్ కన్నా ఆలస్యంగా మొదలవుతుందా చూడాలి.
This post was last modified on November 22, 2023 1:15 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…