Movie News

అజయ్ భూపతి.. కసి చూపించాడు

అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన ‘ఆర్ఎక్స్ 100’ అనే సినిమా ప్రోమోలు చూసి ఇదేదో బూతు సినిమాలా ఉందనుకున్న వాళ్లే ఎక్కువమంది. ఆ సినిమాకు తొలి రోజు చాలా చోట్ల థియేటర్లు ఫుల్ అయిపోయాయంటే అందుక్కారణం.. ప్రోమోల్లో చూపించిన టెంప్టింగ్ విజువల్సే కారణం. సినిమాలో ప్రథమార్ధ:లో వచ్చే కొన్ని బోల్డ్ సీన్లు చూస్తే.. అది యువత కామోద్రేకాలకు రెచ్చగొట్టి క్యాష్ చేసుకునే బి-గ్రేడ్ సినిమాలా కనిపించింది. కానీ సినిమా అంతా అయ్యాక కానీ.. దాని ఇంపాక్ట్ అర్థం కాదు. కథానాయిక పాత్రను.. అందులోని మరో కోణాన్ని మైండ్ బ్లోయింగ్ అనిపించే రీతిలో ప్రెజెంట్ చేసి వావ్ అనిపించాడు దర్శకుడు అజయ్ భూపతి. ముఖ్యంగా రావు రమేష్-పాయల్ మధ్య ప్రి క్లైమాక్స్‌లో వచ్చే సీన్‌కు థియేటర్లు ఊగిపోయాయి. మొదట్లో ‘ఆర్ఎక్స్ 100’ చూసి దాని ప్రత్యేకతను చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. కానీ కాల క్రమంలో అది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది.

‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ తన మీద పెరిగిన భారీ అంచనాలను అందుకోలేకపోయాడు. ‘మహాసముద్రం’లో తన మార్కు చూపించలేకపోయాడు. ‘ఆర్ఎక్స్ 100’లో మాదిరి ట్విస్టులు, షాక్‌లు ఆశిస్తే.. అలాంటివేమీ లేకుండా ఒక ఫ్లాట్ సినిమా తీసి నిరాశపరిచాడు. చాలామంది దర్శకుల్లాగే ద్వితీయ విఘ్నాన్ని ఎదుర్కొన్నాడు. దీంతో అతను ‘వన్ ఫిల్మ్ వండర్’ అయిపోతాడా అన్న సందేహాలు కలిగాయి. కానీ ‘మంగళవారం’తో ఆ సందేహాలకు తెరదించాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తేనే ఇందులో ఏదో ప్రత్యేకత ఉందని అర్థమైంది. ఇక సినిమా చూస్తే అంచనాలకు మించే ఔట్‌పుట్ ఇచ్చాడు అజయ్. ‘మంగళవారం’ చూసిన వాళ్లంతా చెబుతున్న మాట.. అజయ్ ఒక కసితో ఈ సినిమా తీశాడని. తొలి సినిమాలో మాదిరే హీరోయిన్ పాత్రను సెన్సేషనల్‌గా డిజైన్ చేశాడు. ఆ పాత్రను మళ్లీ పాయలే చేసింది. ఆమె కూడా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడంతో ‘మంగళవారం’ ఒక స్పెషల్ ఫిలింగా నిలబడింది.

‘మంగళవారం’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కొంచెం జీర్ణించుకోలేని విధంగా ఉంటుంది. అదొక యునీక్ కాన్సెప్ట్‌. కొన్ని సీన్లు పచ్చిగా అనిపిస్తాయి. అంత బోల్డ్‌గా, రస్టిక్‌గా ఒక కాన్సెప్ట్‌ను, లీడ్ రోల్‌ను ప్రెజెంట్ చేసి మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి సీన్లు తీస్తున్నపుడు ప్రేక్షకులు తట్టుకోలేరేమో అని చాలామంది రాజీ పడిపోతారు. కానీ ఆ కాన్సెప్ట్‌ను బలంగా చెప్పాలంటే అలా చూపించడమే కరెక్ట్ అని బలంగా నమ్మి తీశాడు అజయ్. చాలామంది టచ్ చేయడానికి కూడా భయపడే కాన్సెప్ట్‌ను ఒక కన్విక్షన్‌తో తెరపై ప్రెజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. మామూలుగా తమిళ దర్శకులే ఇలాంటి కాన్సెప్ట్స్‌ను ఇలా డీల్ చేస్తుంటారు. ముందు పాయల్, పాత్రను ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలు చూస్తే యూత్‌కు వెర్రెత్తించడానికి ఆ పాత్రను అలా డిజైన్ చేశాడా అనిపిస్తుంది. కానీ ‘ఆర్ఎక్స్ 100’లో మాదిరే అసలు కాన్సెప్ట్ అర్థమయ్యాక అభిప్రాయం మారుతుంది. కథానాయిక పాత్రను చూసి అయ్యో అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌తో రచయితగా, దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్న అజయ్.. చివరి అరగంటలో ట్విస్ట్‌లతో ఉత్కంఠభరితంగా సినిమాను నడిపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. కమర్షియల్‌గా సినిమాను మంచి స్థాయిలో నిలబెట్టాడు. ‘ఆర్ఎక్స్ 100’ కంటే కూడా దర్శకుడిగా అజయ్ ఈ సినిమాతో ఎక్కువ పేరు, గౌరవం సంపాదించుకుంటున్నాడు. ‘మంగళవారం’ తర్వాత అజయ్ మీద అంచనాలు కచ్చితంగా పెరుగుతాయనడంలో సందేహం లేదు.

Satya

Recent Posts

ముగిసిపోయిన పెద్ది కథలో చూడాల్సిన కోణం

పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…

26 minutes ago

ఓజి 2… తమన్ చెప్పిన శుభవార్త

గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్…

31 minutes ago

నాని నెక్స్ట్… ఒకటి డౌట్.. ఒకటి ఫిక్స్?

టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…

45 minutes ago

కళాకారుడి చెమటకు దక్కిన గౌరవం

చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…

1 hour ago

బ్యాన్ వల్లే ఎక్కువ మంది చూసారా?

సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…

2 hours ago

కంగనా సినిమా… 250 కోట్లు కట్టమంటున్నారు

బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్‌కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…

2 hours ago