మాములుగా స్టార్ హీరో సరసన అవకాశం రావాలంటే ఏ హీరోయిన్ కైనా ట్రాక్ రికార్డు చాలా కీలకం. దర్శకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అందులోనూ షారుఖ్ ఖాన్ అంటే వేరే చెప్పాలా. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన డంకీ డిసెంబర్ 21న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాద్షాకు జోడిగా తాప్సీ పన్ను నటించింది. ఈ మూవీ మీద ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైనోసర్ లాంటి సలార్ పోటీలో ఉన్నా సరే దానికి ధీటైన పోటీ ఇస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. మరి దీనికి తాప్సీ అదృష్టానికి లింక్ ఏంటో చూద్దాం.
ప్రస్తుతం తాప్సీ వరస ఫ్లాపుల్లో ఉంది. 2020లో తప్పడ్ మంచి విజయం సాధించాక వరస పరాజయాలు పలకరించాయి. తెలుగులో చేసిన మిషన్ ఇంపాజిబుల్, బాలీవుడ్ మూవీస్ శభాష్ మితు, దోబారా, తడ్కా అన్నీ డిజాస్టర్లే. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్న అన్నాబెల్లె సేతుపతి, హసీన్ దిల్ రుబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా, బ్లర్ ఓ మోస్తరుగా స్పందన తెచ్చుకున్నాయి. నటన పరంగా పేరొచ్చింది కానీ వాటి వల్ల అమాంతం అవకాశాల వెల్లువ కురవలేదు. అయితే బదలా, ముల్క్ లో ఈమె నటన చూసిన హిరానీ తన డంకీలో పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న షారుఖ్ జోడి ఆఫర్ ఇచ్చారు.
ఇది బ్లాక్ బస్టర్ అయితే తాప్సీకి కొత్త ఇన్నింగ్స్ దొరికినట్టే. పాత్రధారులు ఎవరైనా సరే రాజ్ కుమార్ హిరానీ సినిమాల్లో ఖచ్చితంగా నటనకు బోలెడు ఆస్కారం ఉంటుంది. షారుఖ్ తో పోటీ పడుతూ తాప్సీ కనక మెప్పిస్తే మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ కొట్టిపారేయలేం. ముఖ్యంగా ఓవర్సీస్ లో డంకీకి భారీ స్పందన దక్కుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. 2010లో ఝుమ్మంది నాదంతో తెరకు పరిచయమైన తాప్సీ ప్రభాస్, వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా ఆశించిన బ్రేక్ దక్కలేదు. ఇప్పుడు డంకీ ఏమైనా కొత్త మలుపు ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on November 22, 2023 11:08 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…