విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే మొదటిసారి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విమర్శలు అందుకున్న వెబ్ సిరీస్ రానా నాయుడు ఫీడ్ బ్యాక్ సీరియస్ గానే పని చేసింది. ఇవాళ జరిగిన సైంధవ్ ఆడియో సింగల్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక అభిమాని తెచ్చిన ప్రస్తావనకు వెంకీ స్పందించారు. ఫస్ట్ సీజన్ ని కుర్రాళ్ళు ఎంజాయ్ చేశారని, అయితే పెద్దోళ్ళు ఏంట్రా ఇలా చేశావని అడగటంతో ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తామని, నెట్ ఫ్లిక్స్ నుంచి ఆల్రెడీ కాల్ వచ్చిందని త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామనే సంకేతం ఇచ్చారు. సో కొనసాగింపు గురించి అఫీషియల్ గా చెప్పారు.
దీన్ని బట్టే కుటుంబ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ప్రభావం చూపించినట్టు అర్థమైపోయింది. నిజంగానే రానా నాయుడులో అబ్జెక్షన్ అనిపించే కంటెంట్ చాలా ఉంది. అడల్ట్స్ ఓన్లీ అనే ట్యాగ్ పెట్టారు కానీ ప్రముఖ దిన పత్రిలలో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చినప్పుడు పరిమితంగా పెద్దలు మాత్రమే చూడండని పరిమితం చేయడం కష్టం. ఈ సమస్య వల్లే ఏముందో తెలియకుండా కేవలం వెంకటేష్ చేశాడనే నమ్మకంతో మొదలుపెట్టేసి నిమిషాల్లో ఆపేసిన లేడీ ఫ్యాన్స్ చాలా ఉన్నారు. యూత్ ఎంజాయ్ చేయొచ్చు కానీ వెంకీకున్న ఫాలోయింగ్ కి ఇవి సరిపడవనేది అందరి అభిప్రాయం.
సైంధవ్ విడుదలయ్యాకే వెంకటేష్ ఫ్రీ కాబోతున్నారు. జనవరి 13 దాకా నాన్ స్టాప్ ప్రమోషన్లు ప్లాన్ చేసిన నేపథ్యంలో నెల రోజులకు పైగా పూర్తి షెడ్యూల్ దానికే ఇవ్వబోతున్నారు. ఇవాళ వదిలిన సాంగ్ కూడా మంచి మాస్ నెంబర్ కావడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. గణేష్ తర్వాత ఆ రేంజ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సైంధవ్ లో ఉంటుందని అంచనాలు బలంగా ఉన్నాయి. హిట్ ఫస్ట్ కేసు, సెకండ్ కేస్ లతో వరస బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను తక్కువ టైంలోనే పెద్ద హీరోతో ఛాన్స్ కొట్టేశాడు. గుంటూరు కారం, ఈగల్, ఫ్యామిలీ స్టార్ తదితర సినిమాలతో సైంధవ్ కు గట్టి పోటీ ఉంది.
This post was last modified on November 21, 2023 6:15 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…