Movie News

హోమో సెక్సువల్ పాత్రలో స్టార్ హీరో

ఆరు దశాబ్దాల వయసు దాటిన స్టార్ హీరోలు ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా ఎక్కువ తక్కువ జరిగిందంటే దాని ప్రభావం ఇమేజ్ మీద పడుతుంది కాబట్టి. కానీ మలయాళం మెగాస్టార్ గా ఫ్యాన్స్ పిలుచుకునే మమ్ముట్టి మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదు. ఆయన కొత్త సినిమా కాతల్ ది కోర్ ఈ వారం విడుదల కాబోతోంది. సూర్య భార్య, సీనియర్ హీరోయిన్ జ్యోతిక జంటగా నటించింది. జాతీయ అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న జ్యో బేబీ దర్శకత్వంలో రూపొందింది. దీన్ని ఖతర్, కువైట్ దేశాల్లో నిషేధించారు. కారణం అంత షాకింగ్ గా ఉంటుంది.

మమ్ముట్టి ఈ చిత్రంలో పోషించిన పాత్ర పేరు జోసెఫ్. తీకోయ్ అనే చిన్న ఊళ్ళో కో ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి రిటైర్ అయ్యాక పంచాయితీ ఎన్నికలలో నిలబడాలని నిర్ణయించుకుంటాడు. భార్య ఓమానా హఠాత్తుగా కోర్టులో విడాకులకు పిటీషన్ వేస్తుంది. కారణం ఏంటయ్యా అంటే తన భర్త స్వలింగ సంపర్కుడని పేర్కొంటూ ఊళ్ళో పెను సంచలనం రేపుతుంది. తంకన్ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపే స్నేహితుడితో సంబంధం ఉందని పేర్కొంటుంది. ఈ విషయం ముందే తెలిసినా మౌనంగా ఉంటూ వచ్చి సరిగ్గా ఎలక్షన్ల టైంలో బయట పెట్టడంతో గ్రామంలో కలకలం రేగుతుంది. ఈ పరిణామాలే కాతల్ ది కొర్.

రిలీజ్ కు ముందే కథ మొత్తం ఇంత డిటైల్డ్ గా రావడం మలయాళంలో సహజమే. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే మమ్ముట్టి దీనికి ఒప్పుకోవడమే కాదు ఏకంగా నిర్మించడం కూడా. గతంలో పృథ్విరాజ్ సుకుమారన్ ముంబై పోలీస్ లో ఇదే తరహా క్యారెక్టర్ చేసి హిట్ అందుకున్నాడు. దాన్నే సుధీర్ బాబు హంట్ గా రీమేక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మమ్ముట్టి ట్రై చేస్తున్నాడు. ఇంత లేటు వయసులో ఇలాంటి రిస్కీ సబ్జెక్టులను ఎంచుకోవడం నిజంగా ఛాలెంజే. అక్కడేమో కానీ మన ఆడియన్స్ ఇలాంటివి రిసీవ్ చేసుకోవడం కష్టం. అందులోనూ స్టార్ హీరోల సినిమాల్లో. 

This post was last modified on November 21, 2023 12:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

49 minutes ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

49 minutes ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

1 hour ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

2 hours ago

ఢిల్లీకి చేరిన ‘తెలుగు వారి ఆత్మ‌గౌరవం’

తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు క‌ర్ణాట‌క‌లోని…

3 hours ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

5 hours ago