తాను ఇప్పటిదాకా పని చేసిన హీరోల్లో అత్యంత అల్లరి వాళ్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లే అంటున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ సందర్భంగా వీళ్లిద్దరూ చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదని రాజమౌళి చెప్పాడు.
తారక్ అల్లరేంటో తనకు ముందు నుంచి తెలుసని.. ఇప్పుడు అతడి అల్లరి ఇంకా పెరిగిందని.. అతడికి రామ్ చరణ్ లాంటి మరో అల్లరోడు దొరకడంతో షూటింగ్ స్పాట్లో వీళ్లను మేనేజ్ చేయడం చాలా కష్టమవుతోందని జక్కన్న చెప్పాడు.
ఇద్దరిలో ముందుగా తారకే.. చరణ్‌ను కెలుకుతుంటాడని.. చరణ్ కూడా తర్వాత అందుకుంటాడని జక్కన్న చెప్పాడు. సెట్లో ఒకరికి సీరియస్‌గా ఏదైనా చెబుతుంటే.. ఇంకొకరు కామెడీ చేస్తుంటారని, నవ్వుతుంటారని.. వీళ్లను కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతోందని రాజమౌళి తెలిపాడు.
ఇక తన గత సినిమా ‘బాహుబలి’ విషయానికి వస్తే.. ప్రభాస్, రానా కూడా కొంత అల్లరి చేశారని.. కానీ వాళ్లు మరీ ఎక్కువ అల్లరి చేయడానికి అవకాశం లేకపోయిందని జక్కన్న వెల్లడించాడు. అది భారీ కాస్ట్యూమ్స్, మేకప్‌తో ముడిపడిన సినిమా కావడంతో ఎక్కువ అల్లరి చేస్తే, నవ్వితే అవి చెదిరిపోయేందుకు ఆస్కారం ఉండటంతో ఆ ఇద్దరూ ఎక్కువ సమయం కామ్‌గా ఉండాల్సి వచ్చిందని రాజమౌళి తెలిపాడు. ఐతే షూటింగ్ ముగిశాక మాత్రం ప్రభాస్.. రానాను ఎక్కువగా కెలుకుతూ ఉండేవాడని ఆయన తెలిపాడు.
ప్రభాస్ బయటికి కామ్‌గా కనిపించినా బాగా అల్లరి వాడే అని రాజమౌళి తెలిపాడు. ఐతే ఆన్ సెట్స్, షూటింగ్ గ్యాప్‌లో ప్రధాన పాత్రధారులు ఎంత అల్లరి చేసినా.. సన్నివేశాలు చేసేటపుడు మాత్రం ఎంత సీరియస్‌గా పని చేస్తారన్నది రాజమౌళి సినిమాల్లో ఇంటెన్సిటీ చూస్తే అర్థమవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’లో కూడా ఆ ఇంటెన్సిటీకి ఏమాత్రం కొదవ లేదని ఇటీవలే రిలీజ్ చేసి సీతారామరాజు పాత్ర టీజర్‌తో స్పష్టమైంది.
This post was last modified on April 26, 2020 9:38 pm
టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…