మాములుగా ప్యాన్ ఇండియా అంటే దేశం మొత్తం కలుపుకుని ఓ అయిదారు భాషల్లో రిలీజ్ చేయడమే మనకు తెలుసు. మహా అయితే ఇంకో రెండు మూడు అదనంగా ఉంటాయి. కానీ వరల్డ్ వైడ్ వాడుకలో ఉన్న 38 లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చేయడమంటే సాహసమే. సూర్య కంగువ ఈ ఫీట్ కి రెడీ అవుతోంది. ఇటీవలే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ విషయాన్ని చెప్పడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇదొక్కటే కాదు ఐమ్యాక్స్, 3డి కోసం విడిగా వర్షన్లు సిద్ధం చేస్తున్నారు. ప్రాధమికంగా ఏప్రిల్ 11 లాక్ చేసుకున్నారు కానీ అధికారికంగా చెప్పలేదు.
ఈ లెక్కన కంగువా ఒక అరుదైన రికార్డుకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు పది భాషలే అన్నారు. ఇప్పుడు ఏకంగా ఇంకో ఇరవై ఎనిమిది జోడించారంటే బడ్జెట్ పరంగా ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కమర్షియల్ మసాలా సినిమాలతో బ్లాక్ బస్టర్లు తీసే సిరుతై శివ దీనికి దర్శకుడు. రజనీకాంత్ పెద్దన్న డిజాస్టర్ తర్వాత అతను చేస్తున్న భారీ చిత్రం ఇదే. సూర్య నెలల తరబడి దీనికి డేట్లు కేటాయించి వేరే సినిమాలను తాత్కాలికంగా పక్కన పెట్టాడు. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ విదేశాల్లో జరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి.
యువి సంస్థ ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఎంత పెట్టుబడి అనేది బయటికి రాలేదు కానీ ఊహకందని మొత్తమే అయ్యుంటుంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న బాబీ డియోల్ ఈ కంగువాతోనే కోలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. కనివిని ఎరుగని రీతిలో ఒక విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని జ్ఞానవేల్ రాజా టార్గెట్ గా కనిపిస్తోంది. అయితే గతంలో బాహుబలిని బీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని తీసిన విజయ్ పులి, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ ఇతర రాష్ట్రాల ఆడియన్స్ ని మెప్పించలేకపోయాయి. మరి కంగువా ఏం చేస్తుందో.
This post was last modified on November 20, 2023 9:58 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…