ఒక సింహా.. ఒక లెజెండ్.. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాలివి. తన మార్కెట్, ఫాలోయిగ్ దెబ్బ తింటున్న సమయాల్లో వచ్చిన ఈ సినిమాలు బాలయ్యకు గొప్ప ఉపశమనాన్నిచ్చాయి. ఇప్పుడు బాలయ్య కెరీర్ మరోసారి ప్రమాదంలో ఉంది. అలాంటి తరుణంలోనే మళ్లీ బోయపాటి శ్రీనుతో జట్టు కట్టాడు.
వీళ్లద్దరి కలయికలో రాబోతున్న మూడో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఐతే ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో బాలయ్య అఘోరా తరహా పాత్ర చేస్తున్నాడని.. అందుకోసమే గుండు కొట్టించుకున్నాడని ఒక రూమర్ హల్ చల్ చేసింది. అలాగే ఇదొక పొలిటికల్ డ్రామా అని కూడా ప్రచారం సాగింది. ఇంకా ఇందులో హీరోయిన్ల గురించి కూడా రకరకాల వార్తలొచ్చాయి.
ఐతే శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారాలపై బోయపాటి స్పందించాడు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బాలయ్యతో తాను చేస్తున్న కొత్త చిత్రం పొలిటికల్ డ్రామా కాదని బోయపాటి తేల్చేశాడు. ఇదొక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇందులో సరిపడా యాక్షన్ కూడా ఉంటుందని బోయపాటి తెలిపాడు.
ఇక అఘోరా పాత్ర గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా వారణాసిలో ఒక కీలకమైన ఎపిసోడ్ ఉంటుందని, అందులో బాలయ్య గెటప్, ఆయన నటన ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెప్పడం ద్వారా అఘోరా తరహా పాత్ర ఉండే అవకాశముందని చెప్పకనే చెప్పాడు బోయపాటి.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఇద్దరిని ఇంతకుముందు ఖరారు చేశామని.. కానీ లాక్ డౌన్ కారణంగా వాళ్ల డేట్ల విషయంలో సమస్య తలెత్తిందని.. షూటింగ్ మళ్లీ మొదలయ్యే సమయానికి పరిస్థితుల్ని బట్టి హీరోయిన్లు ఎవరనే విషయం చెప్పగలమని బోయపాటి స్పష్టత ఇచ్చాడు.
This post was last modified on April 26, 2020 9:38 pm
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్‌లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు…