మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో మంగళవారం ఒక్కటే మంచి టాక్ తో వసూళ్లను రాబడుతోంది. యూనిట్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు నాలుగున్నర కోట్లకు పైగా గ్రాస్ రావడం పెద్ద విశేషమే. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం కంటెంట్ తో మార్కెటింగ్ చేసిన మూవీకి ఇలాంటి ఓపెనింగ్ తేలిగ్గా తీసుకునేది కాదు. ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్ లేకపోయి ఉంటే కలెక్షన్లలో గణనీయమైన పెరుగుదల కనిపించేది. ఇప్పుడీ మ్యాచ్ పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారిపోయింది. నిన్న దిల్ రాజు అతిథిగా మంగళవారం టీమ్ సక్సెస్ మీట్ జరిపి తన ఆనందాన్ని పంచుకుంది.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ దర్శకుడు వంశీ తీసిన క్లాసిక్ థ్రిల్లర్ అన్వేషణ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది 1985లో వచ్చిన కల్ట్ మూవీ. సస్పెన్స్ ఎలిమెంట్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఇళయరాజా సంగీతం, అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపాయి. దీంట్లో కథేంటంటే ఆడవిలో వరసగా హత్యలు జరుగుతాయి. అవి పులి చేసిందన్న ప్రచారాన్ని గ్రామ ప్రజలు నమ్ముతారు. కేసుని విచారించడానికి వచ్చిన కార్తీక్ హీరోయిన్ భానుప్రియ సహాయంతో హంతకులెవరో పట్టుకుంటాడు. ఊహించని పరిణామాల మధ్య శరత్ బాబు, రాళ్ళపల్లిగా తేలుతారు. ఇక మంగళవారం విషయానికి వద్దాం.
పల్లెటూళ్ళో అక్రమ సంబంధాల హత్యలు, అందరూ అమ్మోరు శాపం అనుకోవడం, పాయల్ రాజ్ పుత్ మీద అనుమానం, చివరికి ఎవరూ ఊహించని మనిషి అసలు దోషిగా బయట పడటం, దాని వెనుకో షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ దర్శకుడు అజయ్ భూపతి చాలా షాకింగ్ గా చూపించారు. ముఖ్యంగా చివరి ముప్పావు గంట ట్విస్టులతో పరుగులు పెట్టించారు. అన్వేషణకు దీనికి నెరేషన్ స్టైల్ లో ఈ పోలికలు కనిపిస్తాయి. దిల్ రాజు, రివ్యూయర్లు ఈ కోణంలోనే వంశీ మేకింగ్ ని గుర్తు చేసుకున్నారు. అయినా అజయ్ భూపతి తానెంతో ఇష్టపడే వంశీతో పోలిక రావడం కన్నా గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది.
This post was last modified on November 19, 2023 12:02 pm
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…
తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును…
ఏపీ సీఎం చంద్రబాబు విషయం గురించి చెబుతూ… మంత్రి నారాయణ ఒక మాట చెప్పారు. "మనం వచ్చే రెండు మూడేళ్ల…
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…
థియేటర్లలో జనాలు లేక అలో లక్ష్మణా అంటూ అల్లాడిపోతున్న బయ్యర్లకు ఊరట కలిగించేందుకు ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు…
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…