ఇంకో ఐదు వారాలు మాత్రమే సమయం ఉంది ‘సలార్’ ఆగమనానికి. నెలన్నర ముందే విడుదల కావాల్సిన ఈ భారీ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల వాయిదా పడ్డ సంగతి తెలసిందే. నెల రోజులకు పైగా సస్పెన్స్ తర్వాత డిసెంబరు 22న రిలీజ్‌కు కొత్త డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులు కోరుకున్నట్లుగా ప్రమోషన్లు ఊపందుకోకపోవడానికి పోస్ట్ ప్రొడక్షన్, బిజినెస్ వ్యవహారాలకు సంబంధించిన తలనొప్పులే కారణమని వార్తలు వచ్చాయి.
ఐతే బిజినెస్ డీల్స్ దాదాపుగా ఓకే అయినట్లే తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఏ రాష్ట్రంలో ఎవరు తమ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటిస్తోంది ‘సలార్’ టీం. తాజాగా నైజాం ‘సలార్’ డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి సస్పెన్సుకి తెరదించారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నదే నిజమని తేలింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ‘సలార్’ను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. నైజాం హక్కులను మైత్రీ వాళ్లు దాదాపు రూ.75 కోట్లకు కొన్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రేటు సంగతి చెప్పే అవకాశం లేదు కానీ.. దిల్ రాజును దాటి మైత్రీ వాళ్లు ఈ భారీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతుండటం మాత్రం విశేషమే. ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ల వివరాలను సలార్ టీం ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా వరకు గీతా సంస్థ సినిమాను రిలీజ్ చేస్తోంది.
ఉత్తరాంధ్రకు శ్రీ సిరి సాయి సినిమాస్, సీడెడ్లో శిల్పకళా ఎంటర్‌ప్రైజెస్.. తూర్పుగోదావరిలో లక్ష్మీ నరసింహా మణికంఠా ఫిలిమ్స్, కృష్ణా-గుంటూరులో కేఎస్ఎన్ టెలీ ఫిలిమ్స్, నెల్లూరులో వెంగమాంబ సినిమాస్ ‘సలార్’ను రిలీజ్ చేస్తున్నాయి. తమిళనాట ఉదయనిధి స్టాలిన్ సంస్థ రెడ్ జెయింట్స్ హక్కులు దక్కించుకోగా.. ‘సలార్’లో విలన్ పాత్ర చేస్తున్న పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని కేరళలో రిలీజ్ చేస్తున్నాడు. కర్ణాటకలో హోంబలె ఫిలిమ్స్ సొంతంగా సినిమాను రిలీజ్ చేస్తోంది. ఇక నార్త్ ఇండియా సంగతే ప్రకటించాల్సి ఉంది.
This post was last modified on November 17, 2023 5:59 pm
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…