అమితాబ్ బచ్చన్ తరం హవా ముగిశాక బాలీవుడ్‌ను సుదీర్ఘ కాలం ఏలింది ఖాన్ త్రయమే. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. ఈ ముగ్గురూ ఎవరికి వారే సాటి అన్నట్లు భారీ విజయాలు సాధించారు. తిరుగులేని స్టార్ డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నారు. 90వ దశకం వరకు ఆమిర్ కంటే షారుఖ్, సల్మాన్ ఒక మెట్టు పైన ఉన్నట్లు కనిపిస్తే.. 2000 తర్వాత ఆమిర్ ఖాన్ స్పష్టమైన పైచేయి సాధించాడు. అలా అని మిగతా ఇద్దరినీ తక్కువ అంచనా వేయలేని పరిస్థితి.
ఒక టైం వరకు సల్మాన్, షారుఖ్ పోటాపోటీగా ఉన్నారు. ఐతే ఒక దశ దాటాకా షారుఖ్ హవా తగ్గింది. ఆమిర్ ఖాన్ ‘దంగల్’ లాంటి ఆల్ టైం హిట్ కొట్టి ఊపులో ఉంటే.. మరోవైపు సల్మాన్ ‘భజరంగి భాయిజాన్’, ‘సుల్తాన్’ లాంటి మెగా హిట్లు అందుకున్నాడు. వీరిని అందుకోవడం షారుఖ్‌కు అసాధ్యం అనే పరిస్థితి కనిపించింది. కానీ చూస్తుండగానే వేగంగా పరిస్థితులు మారిపోయాయి.
ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కింద పడటం.. షారుఖ్ అనూహ్యంగా రైజ్ అయి వాళ్లు అందుకోలేని స్థాయికి చేరిపోవడం జరిగిపోయాయి. చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేసే ఆమిర్ గత ఏడాది ‘లాల్ సింగ్ చడ్డా’తో దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆ సినిమా అతణ్ని ఎంతగా నిరాశకు గురిచేసిందంటే ఇప్పట్లో కొత్త సినిమా చేసే ఉద్దేశమే ఉన్నట్లు లేదు. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆమిర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అతడి మార్కు సినిమాలు ఇప్పుడు వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.
ఇక సల్మాన్ విషయానికి వస్తే అతడి రొడ్డ కొట్టుడు సినిమాలతో జనాలకు మొహం మొత్తేసింది. ఎన్నో ఆశలతో ఇటీవలే రిలీజైన ‘టైగర్-3’ నిరాశ పరిచింది. ఇక షారుఖ్ ఈ ఏడాది ‘పఠాన్’తో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చి ‘జవాన్’తో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా వసూళ్లకు.. సల్మాన్, ఆమిర్ చిత్రాల కలెక్షన్లకు అసలు పొంతన లేదు. ఈ ఏడాది చివర్లో వచ్చే ‘డంకీ’తోనూ షారుఖ్ మరో పెద్ద హిట్ కొట్టేలా ఉన్నాడు. అతను ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతుంటే.. తన ముందు ఆమిర్, సల్మాన్ మరగుజ్జుల్లా కనిపిస్తున్నారు.
This post was last modified on November 17, 2023 4:57 pm
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…