మేనల్లుడు ఆశిష్ రెడ్డిని హీరోగా సెటిల్ చేయడం కోసం నిర్మాత దిల్ రాజు సెట్ చేస్తున్న కాంబినేషన్లు మాములుగా లేవు. మొదటి సినిమా రౌడీ బాయ్స్ కి అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకుని, దేవిశ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా సెట్ చేయడం దగ్గరి నుంచే ఈ ప్లానింగ్ మొదలయ్యింది. రెండో మూవీ సెల్ఫిష్ కి బిజీగా ఉన్న సుకుమార్ తో రచన చేయించి మరీ రేంజ్ పెంచే విధంగా ప్రణాళికలు రచించారు. తర్వాత సినిమాకి బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్యని తీసుకోవడం దాదాపు కన్ఫర్మే. ఇవన్నీ ఒక ఎత్తయితే శ్రీలీలను ఆశిష్ కి ఆన్ స్క్రీన్ జోడిగా తీసుకొచ్చే ట్రయిల్స్ ముమ్మరం చేశారని టాక్.
ఇంకా ప్రకటించలేదు కానీ తెరవెనుక ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. రౌడీ బాయ్స్ ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా ఒక హిట్ మూవీ కరెక్ట్ గా పడితే కెరీర్ ఊపందుకుంటుంది. ఒక నిర్మాత కుటుంబం నుంచి స్టార్ హీరో తయారు కావడం చాలా అరుదు. ఒక్క రామానాయుడు గారికే అది సాధ్యమయ్యింది. పెద్దబ్బాయి సురేష్ బాబు నిర్మాణ వ్యవహారాలకు పరిమితమైతే వెంకటేష్ రెండో తరం అగ్ర హీరోల్లో ఒకరిగా తిరుగు లేని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు లక్ష్యం కూడా ఇదే అనిపిస్తోంది. ఆశిష్ ని ఎలాగైనా మార్కెట్ ఉన్న హీరో స్థాయికి తీసుకెళ్లాలి.
నెమ్మదిగానే షూటింగ్ జరుపుకుంటున్న సెల్ఫిష్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా దిల్ రాజు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారట. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఆశిష్ కోసం ఇవన్ని చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ కుర్రాడికి సరైన బ్రేక్ దొరికితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడు. అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు కానీ శిరీష్ ఇప్పటికీ కనీస స్థాయిలో కుదురుకోలేదు. ఇక్కడ మాట్లాడేది సక్సెస్ లే కాబట్టి ఆశిష్ కు ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు పడితే అప్పుడు నిర్మాతలు వద్దన్నా వెంట పడతారు.
This post was last modified on November 17, 2023 2:28 pm
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…