కొందరు తమకు గుర్తింపు తెచ్చిన సినిమాలనే ఇంటిపేర్లుగా మార్చుకున్న వాళ్లు చాలామందే కనిపిస్తారు. కానీ ఒక హీరో పేరును ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు ఒక్క ప్రభాస్ శీను మాత్రమేనేమో. నటుడు అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి ప్రభాస్‌తో స్నేహం కుదిరి అతడి మిత్రుడిగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు శీను. నెమ్మదిగా అతను నటుడిగా కూడా బిజీ అయ్యాడు. కామెడీ పాత్రలను పండించడంలో అతడికో ప్రత్యేకమైన శైలి ఉంది.
ఐతే నటుడిగా ఎంత పేరు సంపాదించినా ప్రభాస్‌తో అతడి స్నేహం గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఐతే ఈ మధ్య ప్రభాస్‌తో అతడి స్నేహం చెడిందని.. ప్రభాస్ నుంచి శీను దూరమయ్యాడని సామాజిక మాధ్యమాల్లో కొంత చర్చ జరుగుతోంది. ప్రభాస్ పక్కన కూడా అతను పెద్దగా కనిపించడం లేదు. ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్ శీను. ‘‘నేను నటుడు అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ప్రభాస్ గారితో నాకు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం జరిగి.. అది మంచి స్నేహంగా మారింది.
మేము ఏదో లెక్కలు వేసుకుని, పరిమితులు పెట్టుకుని స్నేహం చేయలేదు. అది అలా కుదిరింది. ఆయనకు నేను నచ్చి దగ్గర పెట్టుకున్నారు. ప్రభాస్ ఏ స్థాయికి వెళ్లినా మా స్నేహంలో ఏ మార్పూ లేదు. అదొక నదీ ప్రవాహం లాంటిది. ఐతే ప్రభాస్ గారితో ఉన్నపుడు నేను కొన్ని సినిమా అవకాశాలు వదులుకున్నాను. దానికి నేనేమీ బాధ పడలేదు. ఐతే గబ్బర్ సింగ్ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చి నటుడిగా బిజీ అయ్యాను. అవకాశాలు పెరగడంతో ప్రభాస్‌తో పాటే ఉంటూ తన పనులు చూసుకుంటూ సినిమాలకు సమయం కేటాయించడం ఇబ్బందైంది.
నేను ఎక్కడో షూటింగ్‌లో ఉండి, ప్రభాస్ నాకు అప్పగించిన పని పూర్తి చేయడం ఇబ్బందిగా అనిపించింది. అందుకే ‘మిర్చి’ సినిమా తర్వాత సినిమాలకు టైం కేటాయించాలనుకున్నా. అదే విషయం ప్రభాస్‌తో మాట్లాడా. నాకు నటన ఇష్టం కాబట్టి, ఆర్టిస్ట్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చా కాబట్టి ఫుల్ టైం ట్రై చేయమన్నాడు. అక్కడేదైనా ఇబ్బంది ఉంటే తిరిగి నా దగ్గరికే వచ్చేయ్ అన్నాడు. అలా ఒక మాట అనుకున్నాక నేను ఇటు బిజీ అయ్యాను. ఒకప్పట్లా ప్రభాస్ దగ్గరే లేదన్న మాటే కానీ.. మా ఇద్దరి స్నేహానికి ఢోకా ఏమీ లేదు’’ అని ప్రభాస్ శీను క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on November 17, 2023 10:04 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…