విక్రాంత్, మెహరీన్, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. విక్రాంత్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించటమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నవంబర్ 17న ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. గురు సోమసుందరం ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ఇంకా ఈ మూవీలో నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
సినిమా ప్రమోషన్స్ చేయటంలో ఎంటైర్ యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. మూవీ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా చాలా బావుందని సెన్సార్ టీమ్ చిత్ర యూనిట్‌ను అభినందించింది. మూవీలో కామెడీ, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకోనున్నాయి. సినిమాను డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ టీమ్ అన్‌కాంప్రమైజ్డ్‌గా రూపొందించారు. మ్యూజిక్, నేపథ్య సంగీతం, విజువల్స్ ఆకట్టుకున్నాయని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ ఎస్సెట్‌గా నిలుస్తుంది.
తొలి సినిమా అయినప్పటికీ విక్రాంత్ చక్కటి నటనను కనపరిచారని సెన్సార్ టీమ్ అభినందించారు. అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘స్పార్క్ లైఫ్’ నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 16, 2023 7:52 pm
ఏపీ విపక్ష పార్టీగా ఉన్న వైసీపీలో జోష్ కనిపించడం లేదు. జగన్ రావాలి.. తమ పార్టీ ముందుకు సాగాలి అన్నట్టుగా…
ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…