ఏ సినిమాకైనా రిలీజైన మొదటి వారంలో వీకెండ్ చాలా కీలకం. సండే వసూళ్లు ఎంత వచ్చాయేదనేదే ఓపెనింగ్ స్థాయిని నిర్దేశిస్తాయి. అయితే ముందే ఊహించిందే అయినా ఇండియా ప్రపంచ కప్ ఫైనల్ కు వెళ్లడం రేపు రిలీజయ్యే సినిమాలకు గండంగా మారింది. నవంబర్ 19 అహ్మదాబాద్ లో తుది సమరం జరగబోతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి ఎవరన్నది ఇవాళ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే పోరులో నిర్ణయమవుతుంది. నిన్న సెమి ఫైనల్ దెబ్బకే చాలా చోట్ల థియేటర్లు బోసిపోయాయి. వర్కింగ్ డే అయినా సరే హాట్ స్టార్ లో 5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటిది ఫైనల్ అందులోనూ సెలవు రోజు వచ్చే క్రేజ్ గురించి వేరే చెప్పాలా. ఇళ్లలో నుంచి జనం బయటికి రావడం కష్టం. రెండు రోజుల ముందు మంగళవారం, సప్తసాగరాలు దాటి సైడ్ బి, మై నేమ్ ఈజ్ శృతి, స్పార్క్ లైఫ్, ఏ చోట నువ్వున్నా, జనం, అన్వేషి విడుదలవుతున్నాయి. పేరుకి ఏడు రిలీజులే కానీ మొదటి రెండు మినహాయించి మిగిలినవి టాక్ మీద ఆధారపడ్డవి. వచ్చే ఆదివారం క్రికెట్ మ్యాచ్ కు కృష్ణార్పణం అయిపోతే వసూళ్లలో పెద్ద కోత పడుతుంది. మ్యాచ్ మధ్యాన్నం రెండుకే అయినా మార్నింగ్ షోలకు సైతం జనం పల్చగానే ఉంటారు. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు లేవు.
తిరిగి సోమవారం సహజంగా ఉండే డ్రాప్ ఎలాగూ తప్పదు. డిసెంబర్ 24న ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ లు వస్తున్నాయి. ఆ లోగా సోషల్ మీడియాలో, పబ్లిక్ టాక్ లో బాగున్నాయని పేరు తెచ్చుకున్నవి తప్పించి మిగిలినవి నిలవడం కష్టం. సెమి ఫైనల్ రోజు సల్మాన్ అంతటి స్టార్ హీరో టైగర్ 3కే తిప్పలు తప్పలేదు. అలాంటిది బడ్జెట్ మూవీస్ గురించి చెప్పదేముంది. సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత ఇండియా ఫైనల్ కు చేరుకోవడంతో అభిమానుల్లో ఉద్వేగం మాములుగా లేదు. టాస్ తో మొదలుపెట్టి రాత్రి పది పదకొండు దాకా టీవీ సెట్ల ముందు నుంచి లేవడం అసాధ్యంగా కనిపిస్తోంది.
This post was last modified on November 16, 2023 12:48 pm
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో…
అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని…