ఇటీవలే దీపావళి పండగ సందర్భంగా చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి ప్రత్యేక ఆహ్వానితులతో జరిగిన సందడి మాములుగా లేదు. అయితే లోపల ఏమేం జరిగిందనే దాని గురించి మీడియాకు సైతం సరైన సమాచారం లేకుండా పోయింది. తాజాగా వీడియోలు బయటికి వస్తున్నాయి. వాటిలో జవాన్ టైటిల్ సాంగ్ కి 68 వయసులో చిరంజీవి వేసిన స్టెప్పులు విపరీతంగా వైరలవుతున్నాయి. అక్కడ చరణ్ తో పాటు ఇతర సెలబ్రిటీస్ కూడా ఉన్నారు.
గాయని రాజకుమారితో ఇంట్లో కన్సర్ట్ పెట్టడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆమెతో లైవ్ పెర్ఫార్మన్స్ ఇప్పించాలంటే లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా మెగా ఫ్యామిలీకి అదేం పెద్ద మ్యాటర్ కాదు కానీ బాలీవుడ్ స్టైల్ లో ఇలా ప్లాన్ చేయడం మాత్రం కొత్తే. అందులోనూ ఒక ప్రైవేట్ పార్టీలో. గత కొన్నేళ్లలో చిరులో ఎప్పుడూ చూడనంత గ్రేస్ ఈ కొన్ని సెకండ్ల వీడియోలో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇది కదా మేము చూడాలనుకున్న డాన్సని సంబరపడుతున్నారు. జగదేకేవీరుడు అతిలోకసుందరి నాటి స్టైల్ కనిపిస్తే అంతే మరి.
ఇప్పుడు చేయబోయే విశ్వంభర ఫాంటసీ మూవీ కాబట్టి ఇలాంటి వాటికి స్కోప్ ఉందో లేదో దర్శకుడు వశిష్టనే చెప్పాలి. ఈ నెల మూడో వారం ఇతర ఆర్టిస్టులతో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాక డిసెంబర్ లో మెగాస్టార్ సెట్స్ లో అడుగు పెడతారట. ఎంఎం కీరవాణి నేతృత్వంలో ఒక పాట రికార్డింగ్ జరిగిపోగా మిగిలిన మ్యూజిక్ సిట్టింగ్స్ జనవరిలో పూర్తి చేస్తారు. భోళా శంకర్ దెబ్బకు కళ్యాణ్ కృష్ణ సినిమా పక్కనపెట్టి మరీ విశ్వంభరని ఎంచుకున్న చిరు మీద యువి క్రియేషన్స్ రెండు వందల కోట్ల బడ్జెట్ ని పెడుతోంది. బలంగా కంబ్యాక్ అవ్వడానికి ఇంతకన్నా గొప్ప ఛాన్స్ ఏముంటుంది.
This post was last modified on November 15, 2023 12:28 pm
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…