సంక్రాంతికి ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పిన సినిమాల్లో నా సామిరంగా లేదు. టీజర్లో పండక్కు వస్తున్నామని హింట్ ఇచ్చారు తప్పించి జనవరి, సంక్రాంతి పేర్లని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. నాగార్జున మనసులో మాత్రం సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సెంటిమెంట్ ని మళ్ళీ రిపీట్ చేయాలనే సంకల్పం బలంగా ఉంది. దానికి తగ్గట్టే దర్శకుడు విజయ్ బిన్నీ షూటింగ్ చాలా వేగంగా చేస్తున్నారు. కేవలం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ కు బయటికి రావడం తప్పించి మిగిలిన సమయమంతా నా సామి రంగాకే కేటాయిస్తున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ల నుంచి పూర్తి సహకారం ఉంటోంది.
డిసెంబర్ మొదటి వారానికి టాకీ పార్ట్ గుమ్మడికాయ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఒకవేళ అది నిజమైతే నాగ్ కోరిక నెరవేరినట్టే. అయితే రావడం రాకపోవడం క్రికెట్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలాగా కొన్ని సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ డ్రాప్ కావడం దాదాపు లాంఛనమేనని ట్రేడ్ టాక్. అదే జరిగితే ఒక స్లాట్ ఖాళీ అవుతుంది. దాన్ని నా సామిరంగాకు వాడుకోవచ్చు. గుంటూరు కారం షూట్ ఇంకా బ్యాలన్స్ ఉన్నప్పటికీ నిర్మాత నాగవంశీ ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా సరే జనవరి 12 నుంచి తగ్గనంటున్నారు కాబట్టి డౌట్ లేదు.
ఇక సైంధవ్, ఈగల్, హనుమాన్ లలో ఎవరూ వెనుకడుగు వేసేందుకు సిద్ధంగా లేరు. అయితే నాగ నమ్మకం ఏంటంటే గుంటూరు కారం మినహాయించి మాస్ ఆడియన్స్ కి సెకండ్ ఛాయస్ నా సామి రంగానే అవుతుందని. ఎందుకంటే వెంకటేష్, రవితేజ, తేజ సజ్జలవి డిఫరెంట్ జానర్స్. యాక్షన్, రివెంజ్, ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నాయి. వీటికి టాక్ చాలా కీలకం అవుతుంది. సో బిసి సెంటర్లలో మహేష్ బాబుతో పాటు ఫస్ట్ అడ్వాంటేజ్ తనే తీసుకోవచ్చు. ఈ సీజన్ మిస్ అయితే నెలాఖరుకు లేదా ఫిబ్రవరికి వెళ్ళాలి. నాగార్జునకు అది సుతరామూ ఇష్టం లేదు. నెగ్గుతాడో తగ్గుతాడో చూడాలి.
This post was last modified on November 15, 2023 11:21 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…