Movie News

స్పై యునివర్స్ – తస్మాత్ జాగ్రత్త

హాలీవుడ్ జేమ్స్ బాండ్ రేంజ్ లో స్పై యునివర్స్ ని సృష్టించి దాని మీదే వరసగా సినిమాలు తీయాలని నిర్ణయించుకున్న యష్ రాజ్ ఫిలింస్ కి మొదటి బ్రేక్ టైగర్ 3 రూపంలో పడింది. రెండు రోజులకే వంద కోట్ల కలెక్షన్లు వచ్చాయని ధీమాగా చెప్పుకుంటున్నారు కానీ పఠాన్, జవాన్ దరిదాపుల్లోకి వెళ్లలేదన్నది వాస్తవం. మూడో రోజు నుంచే వసూళ్లలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. దర్శకుడు మనీష్ శర్మ మీద సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. షారుఖ్ ఖాన్ ఎపిసోడ్, ఓ రెండు యాక్షన్ బ్లాక్స్ మినహాయించి అసలు గొప్పగా మూవీలో ఏముందని సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

కేవలం భారీతనాన్ని నమ్ముకుని, కోట్ల రూపాయలను ఫైట్ల కోసం ఖర్చు పెట్టినంత మాత్రాన ప్రతిసారి ఒకే ఫలితం రాదు. పఠాన్ లోనూ బోలెడు లోటుపాట్లున్నాయి. కానీ మూడేళ్ళ గ్యాప్ తర్వాత షారుఖ్ ని అంత మాసివ్ యాక్షన్ లో చూసేసరికి జనం వెర్రెత్తిపోయారు. కానీ సల్మాన్ మీద అంత సానుభూతి లేదు. లేదంటే కిసీకా భాయ్ కిసీకా జాన్, రేస్ 3ల దారుణంగా పోయేవి కాదు. నెక్స్ట్ సిరీస్ లో టైగర్ వర్సెస్ పఠాన్, వార్ 2, పఠాన్ 2, దీపికా పదుకునేతో స్పై మూవీ, టైగర్ 4 ఇలా చాలా ప్రాజెక్టులే లైన్ లో పెట్టింది. అన్నీ దాదాపుగా విదేశాల్లో జరిగే కథలే. ట్విస్టుల్లో కొంత తేడా ఉంటుంది అంతే.

హాలీవుడ్ ఆడియన్స్, మన ప్రేక్షకుల అభిరుచుల్లో బోలెడు వ్యత్యాసం ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి యష్ అధినేతలు ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది తప్ప ఏదో ట్రెండ్ నడుస్తోందని పదే పదే అవే రుద్దుడు వ్యవహారం చేస్తే అసలుకే మోసం వస్తుంది. వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబో కాబట్టి దాంట్లో పెద్దగా ఇబ్బంది ఎదురవ్వకపోవచ్చు. మళ్ళీ వార్ 3 అన్నప్పుడు అసలు సమస్య వస్తుంది. టైగర్ 3 నార్త్ లో ఏమో కానీ దక్షిణాదిలో మాత్రం బాగా నెమ్మదిస్తోంది. ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఇలా ఒకే జానర్ కి కట్టుబడకుండా ఇతర భారీ ప్రయత్నాలు చేయాలనేదే సగటు మూవీ లవర్స్ కోరిక.  

This post was last modified on November 15, 2023 9:35 am

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

1 hour ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago