ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా సరే జనం దృష్టిలో ఉన్న వాటిలో మొదటి స్థానం మంగళవారందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ మొత్తానికి థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ఇప్పటికే టాక్ ఉంది. 13 కోట్ల దాకా అమ్మకాలు చేసినట్టు సమాచారం. ఈ రేంజ్ మూవీకి ఇది చాలా పెద్ద లెక్క. ట్రైలర్ చూశాక ఒక్కసారిగా బయ్యర్లలో హైప్ వచ్చేసింది. ఇదే జానర్ లో వచ్చిన విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 ఘనవిజయాలు కూడా దీనికో కారణమని చెప్పొచ్చు.
ఇదంతా ఒకే కానీ మంగళవారం భారం మొత్తం ట్విస్టుల మీద పడనుంది. ఇప్పటిదాకా ఏ తెలుగు హీరోయిన్ చేయని పాత్రను పాయల్ రాజ్ పుత్ కు ఆఫర్ చేశారు. అసభ్యత లేకుండా ఆమె ఎపిసోడ్ ని డిజైన్ చేసుకున్నారు. చివరి 45 నిముషాలు వచ్చే మలుపులతో ఆడియన్స్ ఉక్కిరి బిక్కిరి అవ్వడమే కాక బయటికి వచ్చేటప్పుడు ఒక ఎమోషనల్ ఫీల్ తో పాటు పాయల్ క్యారెక్టర్ మీద సానుభూతితో ఆలోచిస్తారట. ఇంత కీలకంగా వ్యవహరించే ఈమె ఎంట్రీ ఇచ్చేది ఇంటర్వెల్ కు ముందు మాత్రమే. అంటే గంటకు పైగా సినిమా కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టుల మీద నడుస్తుందన్న మాట.
దర్శకుడు అజయ్ భూపతి మంగళవారంని ఒక్క భాగంతో ఆపేయడం లేదు. సీక్వెల్ కూడా ఉంటుంది. దానికి ప్లానింగ్ కూడా జరిగిపోయింది. ఒకవేళ మహాసముద్రం హిట్ అయినా దీన్నే తీసేవాడినని అంత కాన్ఫిడెంట్ గా చెప్ప్పడం చూస్తుంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టే అనిపిస్తోంది. సప్తసాగరాలు దాటి సైడ్ బితో పాటు స్పార్క్ తో తలపడుతున్న మంగళవారంకు బాక్సాఫీస్ వద్ద మంచి ఛాన్స్ ఉంది. టాక్ డీసెంట్ గా వచ్చినా చాలు భారీ వసూళ్లు దక్కుతాయి. ఎలాగూ జపాన్, జిగర్ తండ డబుల్ ఎక్స్ లు ఫ్లాపయ్యాయి. టైగర్ 3 బాగా నెమ్మదిస్తోంది. సో ఇంతకన్నా అవకాశం దొరకదు.
This post was last modified on November 14, 2023 4:52 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…