బాలీవుడ్‌ను ఖాన్ త్రయం దశాబ్దాల నుంచి ఏలుతున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ ఒకే టైంలో టాప్ ఫాంలో ఉండటం అరుదు. 2000 తర్వాత చాలా ఏళ్లు ఆమిర్ ఖాన్ ఆధిపత్యం చలాయించాడు. కానీ ఈ మధ్య ఆమిర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ దెబ్బకు కొత్త సినిమా ప్రకటించకుండా సైలెంట్ అయిపోయాడు. షారుఖ్ ఖాన్ మధ్యలో చాలా ఏళ్లు తడబడి ఈ ఏడాది బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు షారుఖ్ ఊపు మామూలుగా లేదు.
ఇక ఖాన్ త్రయంలో మూడో వాడైన సల్మాన్ ఖాన్ మధ్యలో ఒక దశాబ్దం పాటు హవా నడిపించాడు. అతడి సినిమాలు యావరేజ్ టాక్‌తోనే ఇరగాడేసేవి. కానీ ప్రేక్షకుల అభిమానాన్ని గ్రాంటెడ్‌గా తీసుకుని సిల్లీ సినిమాలు చేయడంతో అతడి ఫాలోయింగ్, మార్కెట్ దెబ్బ తింటూ వచ్చింది. సల్మాన్ నిఖార్సయిన హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది.
ఒక టైంలో భజరంగి భాయిజాన్, సుల్తాన్ లాంటి సినిమాలతో టాప్ ఫాంలో ఉన్న కండల వీరుడు.. గత ఆరేడేళ్లలో పేలవమైన సినిమాలు చేసి పేరు దెబ్బ తీసుకున్నాడు. రేస్-3, దబంగ్-3, రాధే, అంతిమ్, కిసీ కా భాయ్ కిసి కి జాన్.. ఇలా అన్నీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. సల్మాన్ అనగానే ఊగిపోయి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేసే పరిస్థితి ఇప్పుడు ఎంతమాత్రం లేదని ‘కిసీ కా భాయ్ కిసి కి జాన్’ ఫలితం చూస్తే అర్థమైంది. ఈ స్థితిలో తనకు బాగా కలిసొచ్చిన ‘టైగర్’ ఫ్రాంఛైజీ మీదే ఆశలు పెట్టుకున్నాడు సల్మాన్.
ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై బ్లాక్ బస్టర్లు కావడంతో ‘టైగర్-3’ కూడా ఆ జాబితాలోకే చేరుతుందని అభిమానులు కూడా ధీమాగా ఉన్నారు. కానీ ఆదివారం రిలీజైన ‘టైగర్-3’ బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. టైగర్ ఫ్రాంఛైజీలో గత రెండు చిత్రాలకు దరిదాపుల్లో కూడా ఇది నిలిచేలా లేదు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మినహాయిస్తే ఇందులో మెరుపులు లేవు. కథలో కొత్తదనం.. మెరుపులు కొరవడి సామాన్య ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సల్మాన్‌కు బాగా కలిసొచ్చిన ‘టైగర్’ ఫ్రాంఛైజీ కూడా కాపాడలేదంటే.. ఇక సల్మాన్ కెరీర్ ఎలా గాడిన పడుతుందో?
This post was last modified on November 13, 2023 12:07 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…