పక్క రాష్ట్రంలో సల్మాన్ ఖాన్ టైగర్ 3కి విడుదల రోజు ఉదయం ఏడు గంటల ఆటలకు అనుమతులిచ్చి ఆ మేరకు షోలు వేయడం అక్కడి హీరోల అభిమానుల్లో పెద్ద చిచ్చు రేపుతోంది. వాస్తవానికి తమిళనాడు సర్కారు ఉదయం 9 గంటల కన్నా ముందు ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ప్రదర్శించకూడదని కఠిన నిబంధనలు అమలు పరుస్తోంది. ఈ విషయంగా లియోకు పెద్ద రచ్చే అయ్యింది. ముందు తెల్లవారుఝామున 4 గంటల అనుమతితో జిఓ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ రద్దు చేయడం ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. అంతకు ముందు రజనీకాంత్ జైలర్ పరిస్థితి కూడా ఇంతే.
అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ కు మాత్రమే ఎలా స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తారని తలైవి, తలపతి అభిమానుల ప్రశ్న. కానీ గవర్నమెంట్ తరఫున ప్రతినిధుల వెర్షన్ వేరేగా ఉంది. పనిదినాల్లో రిలీజ్ చేసే వాటికి మాత్రమే పర్మిషన్లు, టైగర్ 3 ఆదివారం వచ్చింది కాబట్టి ఆ కండీషన్ వర్తించదని అంటున్నారు. ఇందులో లాజిక్ ఉంది కానీ ఈ అంశాన్ని గతంలో ఎప్పుడూ హైలైట్ చేయలేదు. అదే నిజమైతే లియో, జైలర్ లకు మూడో రోజు స్పెషల్ షోలు వేసుకునే వాళ్ళం కదాని బయ్యర్లు అభ్యంతరం లేవనెత్తుతున్నారు. షోలు పడ్డాయని చెప్పేందుకు ప్రూఫ్ గా బుక్ మై షోల స్క్రీన్ షాట్లు కూడా పెట్టుకున్నారు ఫ్యాన్స్.
ఎక్కడా లేని విధంగా తమ దగ్గరే ఇలా ఆంక్షలు పెట్టడం ఏమిటనేది కోలీవుడ్ మూవీ లవర్స్ ఆవేదన. సిఎం స్టాలిన్ కొడుకు స్వయానా మంత్రి కం హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ దీని పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోకపోవడం నిరసనకు కారణమవుతోంది. నిజానికి తెల్లవారకుండానే తమ అభిమాన హీరో సినిమా చూడాలని ఫ్యాన్స్ కి ఎగ్జైట్మెంట్ ఉండటం సహజం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనూ అలాంటి ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. అయినా ఎన్నో ప్రజా సమస్యలు ఉండగా కేవలం స్పెషల్ షోల వల్లే ఏదో తీరని నష్టం జరుగుతోందన్నట్టు వ్యవహరించడం ఏమిటనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం.
This post was last modified on November 13, 2023 6:07 am
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…