స్పై బ్యాక్ డ్రాప్ లో తీసే సినిమాల విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడియన్స్ ని మాత్రం ఏ మాత్రం తేలిగ్గా తీసుకున్నా, కేవలం భారీతనం మీద ఆధారపడి విదేశాల్లో షూటింగ్ చేసినంత మాత్రాన ఫలితం రాదు.
ఈ ఏడాది గూఢచారి నేపథ్యంలో వచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ దీన్నే స్పష్టం చేస్తున్నాయి. నిఖిల్ స్పై ఎంత తిరస్కారానికి గురైందో చూశాం. సరైన హోమ్ వర్క్ లేకుండా రాసుకున్న స్క్రిప్ట్ కి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వరుణ్ తేజ్ లాంటి మెగా హీరో చేసినా గాండీవధారి అర్జున దారుణంగా బోల్తా కొట్టింది. ఓటిటిలోనే ఎవరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు టైగర్ 3కి డివైడ్ టాక్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ ఇమేజ్, షారుఖ్ ఖాన్ క్యామియో, హృతిక్ రోషన్ మెరుపు, కోట్ల రూపాయల బడ్జెట్ ఇవేవి యునానిమస్ టాక్ తీసుకురాలేకపోయాయి. స్క్రీన్ ప్లే కంటే ట్విస్టులు, మేకింగ్ ముఖ్యమనుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది.
ఇక్కడే సినీ ప్రేమికులకు అడవి శేష్ గుర్తొస్తున్నాడు. గూఢచారికి ఎన్ని బడ్జెట్ పరిమితులు ఉన్నా వాటిని తట్టుకుని మరీ అదిరిపోయే కంటెంట్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దర్శకుడు శశికిరణ్ తిక్కాతో కుదిరిన రాపో వల్లే ఇది సాధ్యమయ్యింది. మేజర్ కోసం ఏకంగా మహేష్ బాబు, సోనీ సంస్థలు పార్ట్ నర్స్ అయ్యే స్థాయికి తీసుకెళ్లింది.
సరే క్రేజ్ ఉందని అడవి శేష్ తొందరపడలేదు. గూడచారి 2 కోసం చాలా సమయం కేటాయించుకున్నాడు. డైరెక్టర్ ని మార్చాల్సి వచ్చినా సరే రాజీ పడలేదు. ఎంత లేట్ అయినా పర్వాలేదు క్వాలిటీ ముఖ్యమనుకుని స్క్రిప్ట్ ని ఫైనల్ చేయకుండా మెరుగులు దిద్దిస్తునే ఉన్నాడు.
రెగ్యులర్ షూటింగ్ కి ఎప్పుడు వెళ్ళేది కూడా తెలియనంత గుట్టుని మైంటైన్ చేస్తున్నాడు. ఇంత ఆలస్యానికి న్యాయం చేస్తాడు కనకే అడవి శేష్ జడ్జ్ మెంట్ కి, మార్కెట్ కి అంత విలువ దక్కుతోంది. లేదంటే ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేసేంతగా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి శేషే తొందరపడటం లేదు.
This post was last modified on November 12, 2023 10:14 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…