మెగాస్టార్ చిరంజీవికి సామాన్యుల్లోనే కాదు.. సినీ జనాల్లో కూడా వీరాభిమానులున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న ఎంతోమందికి ఆయనే స్ఫూర్తి. అందుకే చిరు పేరెత్తగానే ఒక్కొక్కరికి ఎమోషన్ తన్నుకొచ్చేస్తుంది. ఆయన మీద తమ అభిమానాన్ని అనేక రకాలుగా చూపిస్తుంటారు. ఈ మధ్య చిరంజీవి పుట్టిన రోజుకు ఆయన మీద అభిమానాన్ని చాటుతూ రకరకాలుగా ట్రిబ్యూట్ వీడియోలు చేశారు ఫ్యాన్స్. అందులో ఒకటి చిరును అమితంగా ఆకట్టుకుంది. ఆ వీడియో చేసిన వ్యక్తులకు ఒక వీడియో సందేశం పంపి అది తననెంత ఆనందింపజేసిందో చిరు చెప్పడం.. వాళ్ల గురించి గొప్పగా మాట్లాడ్డం విశేషం. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు అంటారా? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నాగరాజుగా మెప్పించిన సుధాకర్, అతడి భార్య హారిక.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత నువ్వు తోపురా అనే సినిమా చేసిన సుధాకర్.. అది ఆడకపోవడంతో అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడే సెటిలయ్యాడు. తన భార్య హారిక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. వీళ్లిద్దరూ చిరు పుట్టిన రోజును పురస్కరించుకుని ఛాలెంజ్ సినిమాలోని ఇందువదన పాటకు అదిరిపోయే రీతిలో స్టెప్పులేశారు. పూర్తి పాట వీడియో తీశారు. చిరు, విజయశాంతిలను భలేగా అనుకరించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ పాట చిరు వరకు వెళ్లింది. అది చూసి అమితానందంతో సుధాకర్, హారికలనుద్దేశించి ఒక ఆడియో సందేశం పంపాడు చిరు. దానికి కొన్ని ఫొటోలు, విజువల్స్ జోడించి సుధాకర్ సోషల్ మీడియాలో పెట్టాడు. సుధాకర్, హారిక ఇక్కడే ఉంటే వారి మీద నేరుగా తన ప్రేమను చూపించేవాడినని.. అమెరికాలో ఉండటంతో ఇలా ఆడియో మెసేజ్ ఇస్తున్నానని చిరు చెప్పాడు. సుధాకర్ సినిమా వాడు కావడంతో డ్యాన్సులేయడంలో ఆశ్చర్యం లేదని, కానీ సాఫ్ట్ వేర్ ఇంజినీరైన హారిక ఇంత బాగా డ్యాన్స్ వేయడం, గ్రేస్ చూపించడం ఆశ్చర్యం కలిగించిందని.. అందుకే తాను ఆమెకే ఎక్కువ మార్కులేస్తున్నానని చిరు అన్నాడు. ఇందుకు సుధాకర్, హారిక థ్యాంక్స్ అమితానందంతో చిరుకు థ్యాంక్స్ చెప్పారు.
This post was last modified on August 28, 2020 11:06 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…