హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు తీయడంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులున్న మార్వెల్స్ సంస్థ తన బ్యానర్ నే పేరుగా పెట్టుకుని తీసిన మూవీకి బాక్సాఫీస్ వద్ద ఘోరమైన అవమానం దక్కుతోంది. ఏ మాత్రం కొత్తదనం లేని కథా కథనాలతో ప్రేక్షకులను వెర్రివాళ్ళుగా జమకట్టి చేసిన ప్రయత్నం అడ్డంగా బోల్తా కొట్టింది. కేవలం 1 గంట 45 నిమిషాల నిడివే ఉన్నప్పటికీ ఆద్యంతం కుదురుగా కూర్చుని చూసేందుకు ఆడియన్స్ చాలా కష్టపడుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొన్ని గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ అసలైన కంటెంట్ లో ఫీల్ లేకపోవడం మొత్తంగా దెబ్బ కొట్టింది.
మార్వెల్ నుంచి ఇప్పటిదాకా 32 చిత్రాలు వచ్చాయి. ఇది ముప్పై మూడవది. వాటిలో లేనిది ఇందులో ఉన్నది ఒక్కటంటే ఒక్కటి లేదని నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. పిల్లలను పెద్దలను అలరించేందుకు అవసరమైన అన్ని అంశాలు, సూపర్ హీరో ఎలిమెంట్స్ రాసుకున్నారు కానీ వాటిని సరైన రీతిలో ప్రెజెంట్ చేసి మెప్పించడంలో దర్శకుడు నియా డకోస్టా దారుణంగా విఫలమవ్వడంతో వీకెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా ఇండియాలో తీసికట్టుగా ఉన్నాయి.
అవెంజర్స్ తర్వాత మర్వెల్స్ తీసిన వాటిలో దేనికీ యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. ఆడియన్స్ ని సంతృప్తి పరచలేక నిర్మాతలు కిందా మీద పడుతున్నారు. నాలుగు వేల థియేటర్లలో గ్రాండ్ గా వచ్చిన మార్వెల్స్ కి ఇలాంటి స్పందన రావడం పట్ల దాని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినా ఒకే కథను తిప్పి తిప్పి తీసి మోహాన కొడుతుంటే జనం మాత్రం ఏం చేయగలరు. ఎంతసేపూ విజువల్ ఎఫెక్ట్స్ ని నమ్ముకోవడం తప్ప కొత్తగా ఆలోచించాలన్న తపన లేనప్పుడు ఇలాంటి రిజల్ట్సే వస్తాయి. అందుకే జేమ్స్ క్యామరూన్ అవతార్ కోసం అన్నేసి సంవత్సరాలు కష్టపడేది. ఈ కారణంగానే క్లాసిక్స్ వస్తాయి.
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…